పెళ్లి కాకుండానే న‌య‌న‌తార‌కు అత్తింటి కండీష‌న్లు మామూలుగా లేవే..!

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇకపోతే కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార సినిమాల ద్వారా సక్సెస్ పొందింది.. కానీ ప్రేమ ద్వారా ఎన్నో వైఫల్యాలను ఎదురుచూసింది. ఇక ప్రేమ విషయంలో ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్న నయనతార వాటి నుంచి తేరుకొని మళ్లీ వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

ఇకపోతే సినిమాల ద్వారా మళ్లీ ఊపందుకున్న నయనతార ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక కరోనా సమయంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరు ఆ తర్వాత తమిళనాడు లోని ఒక అమ్మవారి గుడిలో పూజ చేస్తూ మీడియా కంట పడ్డారు. ఇక అలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇకపోతే మరికొద్ది రోజుల్లో నయనతార , విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టబోతోంది.

అయితే పెళ్లి కాకముందే నయనతార అత్త అలియాస్ విఘ్నేష్ శివన్ తల్లి మీనాకుమారి నయనతార కి కొన్ని షరతులను విధించిందట. అవేమిటంటే వివాహం తర్వాత నయనతార సినిమాలకు దూరంగా ఉండాలని.. మంచి పద్ధతి కలిగిన పాత్రలు వస్తేనే చేయాలని ఆమె సూచించింది అట. అయితే ఈ విషయం తెలుసుకున్న నయనతార అభిమానులు మీనా కుమారి పై మండి పడుతూ ఉండగా .. మరొకవైపు నయనతార ఈ కండిషన్స్ కు ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎంత నిజముంది అనే విషయంపై ఈ ఇద్దరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో నయనతార వివాహ వేడుక స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయంపై కొంతమంది నయనతారపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నయనతార మనీ మైండెడ్ అంటూ రకరకాలుగా చెప్పుకుంటూ ఉండటం గమనార్హం.

Share post:

Popular