నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌కు ఇది కదా పడాల్సిన సినిమా..!

నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు సీనియర్ హీరోగా బాలకృష్ణ వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల వచ్చిన అఖండ లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్ళను రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తన 107, 108, 109 సినిమాలను లైనప్ చేసుకున్నారు. ఇప్పటికే, బాలయ్య నటిస్తున్న తన 107వ సినిమాను క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ హంట్ కోటి వ్యూస్‌ను రాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 107లో బాలయ్య మేకోవర్ గురించే చర్చలు సాగుతున్నాయి.

ఇక ఆయన నటించబోతున్న ఎన్‌బీకే 108, ఎన్‌బీకే 109 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్నాయి. ఇక ఎన్.టి.ఆర్ ఇటీవల భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్ 30, 31 భారీ యాక్షన్ చిత్రాలుగా రూపొందనున్నాయి. ఎన్.టి.ఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ 31 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.

2019లో సతీష్ వేగేష్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాను చేశారు కళ్యాణ్ రామ్. అయితే, ఈ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ బింబిసారా అనే పీరియాడిక్ కథాంశంతో బింబిసారా చిత్రాన్ని చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇలాంటి కథాంశంతో సినిమా చేయలేదు. పక్కా కమర్షియల్ సినిమాలు, యాక్షన్ – ఫ్యాక్షన్ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే, పాన్ ఇండియా ఇమేజ్ కావాలంటే బింబిసారా లాంటి సినిమానే పడాలి. అలాంటి సినిమానే కళ్యాణ్ రామ్ సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో అలాగే హిందీలో రూపొందుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Share post:

Popular