మొత్తానికి చైతుపై స‌మంత అలా నెగ్గిందా…!

ఇకపోతే నాగ చైతన్య , సమంత ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. అందుకు సమంత కారణం కావడం అనేది ప్రతి ఒక్కరి వాదన. కానీ వీరిద్దరూ విడిపోవడం అనే విషయాన్ని ఇప్పటికీ కూడా అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు గా తమ కెరియర్ కు సంబంధించిన ప్రణాళికను చాలా చక్కగా రూపొందించుకుంటున్నారు.

ఇక గతాన్ని మరిచిపోయి వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా రేసులో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలకు.. హీరోయిన్లకు మధ్య పోటీ ఉండడం మనం చూశాము.. కానీ ఇక్కడ మాత్రం భార్య , భర్త మధ్య పోటీ ఉండడం మొదటి సారి అని చెప్పాలి. ఇక సమంత , నాగచైతన్య ఒకరికి ఒకరు పోటీ పడుతూ బాలీవుడ్ లో రకరకాల కథలను వింటున్నారు. ప్రస్తుతం ఒకవైపు పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ప్రయత్నం చేస్తూనే.. మరొకవైపు బాలీవుడ్ స్టార్ హీరో లతో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇకపోతే హిందీ ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి చేసే ప్రయత్నం ఇది అని బాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపోతే అమీర్ ఖాన్ , కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర కేవలం కొద్ది క్షణాలే ఉండటంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఇక నాగచైతన్యకి బాలీవుడ్ లో లాంచింగ్ కోసం సరైన సమయం కాదు అని కూడా ప్రచారం చేస్తున్నారు.

కానీ సమంత మాత్రం ఫ్యామిలీ మెన్ 2 సినిమాతో బాలీవుడ్లో దూసుకుపోయింది. ఇక ఇంత పెద్ద సక్సెస్ తో సమంతకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక నాగ చైతన్యతో పోలిస్తే సమంత బాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఇక అలా ఒక రకంగా చెప్పాలంటే నాగచైతన్య పై.. బాలివుడ్ లో సమంత పైచేయి మొదలైందని కొన్ని వర్గాల వారు చెబుతున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ మళ్లీ కలవాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకోవడం గమనార్హం.

samantha
samantha

Share post:

Popular