కమల్ కంటికి అనిరుధ్ కనిపించలేదా..హీట్ పెంచుతున్న అనిరుధ్ మాటలు..!!

యస్,,ఇప్పుడు ఇదే విషయం నెట్టింట వైరల్ గా మారింది. కొన్నాళ్ళుగా హిట్ అంటే ఏంటో తెలియని కమల్ హాసన్ కి ఎట్టకేలకు “లోకేష్ కనగరాజ్” సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా..”విక్రమ్”. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర్ మంచి విషయం అందుకుంది. ఢిఫరెంట్ కధలను ఎంచుకోవడంలో డైరెక్టర్ లోకేష్ తీరే వేరు. విక్రమ్ సినిమాలో కమల్ నటనకు పర్ ఫామెన్స్ కు జనాలు ఫిదా అయ్యారు.

కమల్ ని ఎలా చూడాలి అనుకున్నారో వాళ్ల అభిమానులు. అలానే చూయించాడు లోకేష్. దీంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇన్నాళ్ల తరువాత హిట్ ఆనందాని చూసిన కమల్.,.ఆ సంతొషంలో విక్రమ్ సినిమా కి సంబంధిచిన పలువురికి కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందనే ఆనందంలో కమల్..సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు లగ్జరీ కారును గిఫ్ట్ గా అందించారు. ఇక విక్రమ్ సినిమాలో అతిథి పాత్ర చేసిన సూర్యకు రోలెక్స్‌ వాచీని గిఫ్టుగా ఇచ్చారు. సినిమా క్లైమాక్స్ లో సూర్య పాత్ర సినిమాని మరో మెట్టు ఎక్కించింది.

అంతా బాగానే ఉన్నా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌కు మాత్రం కమల్ ఏ బహుమతీ ఇవ్వలేదట. విక్రమ్ సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. కొన్ని సీన్స్ లో కమల్ స్టైల్ కి అనిరుధ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. అయితే, ఇలాంటి హిట్ ఇచ్చిన అనిరుధ్ కి కమల్ గిఫ్ట్ ఇవ్వకపోవడం పై కోలీవుడ్ లో గుసగుసలు మొదలైయ్యాయి. ఇక రీసెంట్ గా జరిన ఫంక్షన్ లో అయితే రిపోర్టర్ నేరుగా అనిరుధ్ నే అడిగేశాడు. “కమల్ నుండి మీకేమీ బహుమతిగా అందలేదా అని అడిగాడు. దానికి అనిరుధ్ “నాకు విక్రమ్ సినిమాను ఇచ్చారు. ఇంకేం కావాలి” అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అంటే..ఇప్పటి వరకు అనిరుధ్ కి కమల్ ఏం గిఫ్ట్ ఇవ్వలేదని అఫిషియల్ గా చెప్పిన్నట్లే. అస్సలు కంల్ ఈ విషయం ఎలా మర్చిపోయారు ఎవ్వరికి అర్ధంకావడం లేదు.

Share post:

Latest