కొత్త డౌట్లు పుట్టిస్తున్న కృతి యవ్వారం.. బేబ్బమ్మ కొంప ముంచేస్తుందా..?

కన్నడ కుర్ర బ్యూటి కృతి శెట్టి..ఈ పేరుకు స్పేషల్ ఇంట్రడక్షన్ లేకుండా చేసుకుంది. ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమా తో తన తల రాతను తానే మార్చేసుకున్న బ్యూటి. సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే అలా వచ్చి ఇలా పాతుకుపోతారు..ఆ లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్, తమన్నా..ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పక్కన చోటు సంపాదించుకుంది కృతి శెట్టి. చిన్న చిన్న యాడ్స్ లో నటిస్తూ..సినిమాల్లో నటించాలనే ఆశతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది.

అమ్మడు ఇప్పటికి వరకు మూడు సినిమాల్లో కనిపించింది. మూడు కూడా..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నే నిలిచాయి. “ఉప్పెన”, “శ్యామ్ సింగ రాయ్”, “బంగార్రాజు”…ఇలా ,మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు లింగుస్వామీ డైరెక్షన్ లో “ది వారియర్” సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్ని పాటలు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

అయితే, ఇప్పటికే మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా బడా బడా అవకాశాలు అందుకుంటున్న..కృతి శేట్టి..ఇప్పుడు మరో సారి నాగచైతన్య తో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది. NC22లో నాగ చైత‌న్య‌కు జోడీగా శాండిల్ వుడ్ బ్యూటీ కృతి శెట్టి న‌టించ‌నుందని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆల్ రెడీ బంగార్రాజు మూవీ లో అంటించిన ఈ జంట హిట్ పెయిర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తైంలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని..కొందరైతే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు అని కూడా ప్రచారం చేశారు. అయితే, మ‌రోసారి ఈ జంట సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నుంది అని తెలియడంతో..వీళ్ల మధ్య ప్రేమ ఉంది అన్న మ్యాటర్ మరింత హీట్ పెంచుతుంది. మరి చూడాలి బేబ్బమ్మ ఏం చేస్తుందో..?

Share post:

Popular