కెజిఎఫ్ హీరోయిన్ ఓవర్ యాక్షన్..ఫైనల్ రిజల్ట్ అద్దిరిపోలే..?

“అన్ని ఉన్న వాళ్లు సైలెంట్ గా ఉంటారు..ఏమీ లేని వాళ్లే ఎగిరి ఎగిరి పడుతుంటారు “..ఈ సామెత ని మనం మన పెద్ద వాళ్ల దగ్గర తరచూ వింటూ ఉంటాం. ఇప్పుడు ఇదే డైలాగ్ ని అప్లై చేసి..పాన్ ఇండియ హీరోయిన్ శ్రీనిధి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. మనకు తెలిసిందే..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన..”KGF1, KGF 2” సిరీస్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయిన బ్యూటీనే ఈ శ్రీనిధి శెట్టి. రెండు సిరీస్ లో తన నటనకు బాగా పేరు వచ్చింది.

kgf2
kgf2

అబ్బో..సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో అమ్మడు చేసిన హంగామ అంత ఇంతా కాదు. ఏదో KGF సిరీస్ ఆమె వల్లనే హిట్ అయ్యింది అన్నట్లు తెగ హడావుడి చేసేసింది. జనాలు కూడా ఆమెను ఓ దేవతల చూడటం స్టార్ట్ చేశారు. ఫ్లెక్సీలు, ఫ్యాన్ ఫాలొయింగ్, ఆమె ఎక్కడికి వచ్చిన అరుపులు కేకలు..ఆ సందడి చెప్పితే అర్ధంకాదు చూడాల్సిందే..అంతలా ఓ రేంజ్ లో ఆమెకు హైప్ ఇచ్చారు. కొందరు అయితే..టాలీవుడ్, శాండిల్ వుడ్ ని మరి కొన్నేళ్లు పాలించేది ఈమె అంటూ ఫిక్స్ అయిపోయారు.

కానీ, సీన్ కట్ చేస్తే..ఇప్పటి వరకు అమ్మడు ఒక్కటి అంటే ఒక్క సినిమాకి సై చేయలేదు సరికదా..వెబ్ సిరీస్ కి కూడా చేయలేదు. నిజానికి అమ్మడుకి KGF2 తరువాత బోలెడు ఆఫర్స్ వచ్చాయి. కానీ, అమ్మడు ఓవర్ ఎక్స్ పెక్టేషన్ తో రెమ్యూనరేషన్ ని భారీ గా డిమాండ్ చేయడంతో..అమ్మడు గొంతమ్మె కోర్కెలు నిర్మాతలు భరించలేమని చేతులెత్తేశారు. ఇలా వచ్చిన ఆఫర్స్ అన్నింటిని డబ్బు కోసం వదులుకుని..ఇప్పుడు, చేతిలో సినిమాలు లేక..ఫోటో షూట్లతో బ్రతికేస్తుంది. ఏది ఏమైన KGF లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పతీ వరకు ఒక్క సినిమా కి కూడా సైన్ చేయకపోవడం ఆశ్చర్యంకలిగించే విషయమే..?

Share post:

Popular