ఎన్టీఆర్ కొడుకు క్రేజ్ మామూలుగా లేదుగా..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నందమూరి వారసుడు..!!

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసుడు..NTR అంటే జనాలకు గౌరవం, ప్రేమ, అభిమానం. ఈయన ని ఓ హీరో లా కాకుండా తమ ఇంట్లోని వ్యక్తిలా ట్రీట్ చేస్తుంటారు ఫ్యాన్స్. తారక్ అన్న అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు. NTR సినిమాలోకి ..నాన్న , తాత పేరు చెప్పుకుని వచ్చినా..ఏనాడు వాళ్ల పలుకుబడి వాడుకోలేదు. ఆయన సొంత టాలెంట్ తోనే మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుంటూ..ఈ స్దాయికి వచ్చాడు.

రీసెంట్ గా RRR తో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న NTR..ప్రజెంట్..కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి, బుచ్చి బాబు తో సినిమాలు చెయ్యచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే, కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా..తారక్ కొంచెం టైం దొరికిన తన ఇద్దరి పిల్లలితో సమయం గడు పుతుంటాడు. వాళ్లే తన ప్రపంచం అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. NTR-ప్రణతిలకు ఇద్దరు కొడుకులు. అభయ్ రామ్. భార్గవ్ రామ్.

హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. వాళ్ల వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పైగా అభిమానులు వారసుల పుట్టిన రోజులను కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. నేడు NTR చిన్న కొడుకు భార్గవ్ రామ్ పుట్టినరోజు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ కమింగ్ సూపర్ స్టార్ కిడ్ ఫోటోలను షేర్ చేస్తూ..విషెస్ చెప్పుతున్నారు. స్టార్ సెలబ్రిటీలు కూడా భార్గవ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవిస్తున్నారు. భార్గవ్ రామ్ అచ్చం నాన్న NTR లాగే ఉంటాడు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చాలా క్యూట్ గా ముద్దుగా ఉండే ఈ నందమూరివారసుడి బర్తడే ఫోటోలు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

Share post:

Popular