ఎన్టీఆర్ – కొర‌టాల‌.. పూన‌కాల‌తో ఊగిపోయే అప్‌డేట్‌…!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా దగ్గర నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్టీఆర్ తీసిన ప్రతీ సినిమా హిట్ అయింది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తీసిన ఆర్‌ఆర్ఆర్ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలవడంతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో కథల విషయంలో ఎన్టీఆర్ మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాతాలో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా.. మరొకటి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయాల్సి ఉంది.

కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ నెలలో ఎన్టీఆర్-కొరటాల సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభించి 6 నుంచి 7 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్మాతలు డెడ్ లైన్ పెట్టుకున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమాను బాక్సాఫీస్ ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్-కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

Share post:

Popular