కేవలం యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్, ఇమేజ్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే…!

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సాధించిన స్టార్ డమ్ అండ్ క్రేజ్ అసాధారణం. నందమూరి నటులంటే ఇలాగే ఉంటారని తారక్ నిరూపించారు. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కసికి తాను ఒప్పుకున్న సినిమా, అందులో పాత్రను తన శైలికి అనుగుణంగా మలుచుకోవడంలో నిజంగా యంగ్ టైగరే అని చెప్పాలి. దర్శక రచయిత క్రియేట్ చేసిన ఎలాంటి పాత్రలోనైనా తారక్ ఇమిడిపోగలడు..అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఆయన మాత్రమే కాదు, మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి వారందరూ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

దీనికి ఓ ఉదాహరణ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేస్తేనే ఇది కరెక్ట్.. అని చెప్పడం..దాన్ని త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా తీసి కమర్షియల్ హిట్ అందించడం. త్రివిక్రమ్ ముందు పవన్‌తో తీయాలనుకున్న కథ అరవింద సమేత వీర రాఘవ. కథ మొత్తం విన్న పవన్..ఇలాంటి పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ స్టోరీ ఎన్టీఆర్ చేస్తే వేరే లెవల్ అని సలహా ఇచ్చారు. అది నిజం అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఒప్పుకుంటారు. అంటే కొన్ని యావరేజ్ కథలను కూడా తారక్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగలరు.

అలాంటి సినిమాలే టెంపర్ తర్వాత వచ్చినవి. పూరి ఏ సినిమా తీసిన ఇది తన మార్క్ సినిమా అని అందరూ చెప్పుకుంటారు. దానికి కారణం పూరి హీరోను చూపించే విధానంలో తన ప్రభావమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ, టెంపర్ సినిమా విషయంలో మాత్రం పూరి కనిపించరు. ప్రతీ సీన్స్‌లో తారక్ మాత్రమే కనిపిస్తారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్.. ఇది పూరి సినిమా అని ఎవరూ చెప్పలేరు. అలా తారక్ తన పాత్రలో జీవించారు.

ఇక జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ సినిమాలలో కొన్ని కామన్ ఎలిమెంట్స్‌ను గనక గమనిస్తే, ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టే ఈ సినిమా హిట్ సాధించిందీ అని ఖచ్చితంగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాలలోని కథలు ఒకదశలో వీక్ అయిపోతాయి. అక్కడ తారక్ తన ఉగ్రరూపం చూపించి సినిమా గ్రాఫ్‌ను అమాంతం పేంచేస్తారు. ఈ విషయం ఈ 5 సినిమాలు చూసిన వారికి బాగా అర్థమవుతుంది.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అరవింద సమేతలో ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్, జైలవకుశలో రావన్ పాత్ర, నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్, జనతా గ్యారేజ్ సినిమాలో సమంతను వదులుకునే ఎపిసోడ్, ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీముడో సాంగ్ ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే తారక్ ఉంటే ఫ్లాపయ్యే సినిమాను లాక్కొచ్చి హిట్ సినిమాల లిస్ట్‌లో పడేతారు అని దీనినిబట్టే తెలుస్తుంది.

Share post:

Popular