జర్నలిస్ట్ ‘స్వప్న’ రెండో పెళ్లి నిజమేనా… వైరల్ అవుతున్న ఫోటో వాస్తవమేనా…?

జర్నలిస్ట్ స్వప్న అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్ద తెలియదు కానీ, టాలీవుడ్ వివాదాల దర్శకుడు వర్మతో ‘రాముయిజం’ అనే ఇంటర్వ్యూ చేసిన తరువాత అందరికీ సుపరిచితురాలు అయ్యింది. ఆమె ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో జర్నలిస్ట్ గా పనిచేసినప్పటికీ ఈ ఇంటర్వ్యూతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది వాస్తవమో, అవాస్తవమో ఎవరికీ తెలియదు గాని విషయం మాత్రం చాలా సీరియస్ గా బయటకు పోతోంది.

ఇకపోతే, స్వప్న గత కొంతకాలం క్రింద తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి విదితమే. తరువాత అమె ఒంటరిగానే జీవనాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఓ పుకారు సోషల్ సర్కిల్ లో షికారు చేస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే, ప్రస్తుతం అమె రెండవ వివాహం చేసుకుందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈమె పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే దానికి కారణం అని తెలుస్తోంది.

గత కొంత కాలం నుంచి భర్తకు దూరంగా ఉన్నటువంటి ఈమె అమెరికాకు చెందిన ఒక వైద్యుడిని వివాహం చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈమె పెళ్లి గురించి స్వప్న సన్నిహితులు కూడా త‌మ‌కు తెలియ‌ద‌నే అంటున్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని అంటున్నారు. కొంతమంది మాత్రం నిప్పులేనిదే పొగ రాదుకదా అంటూ తీగ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే సదరు ఫోటోని పరిశీలించినట్లయితే మాత్రం అది పూర్తిగా అవాస్తవమై ఉంటుందని స్పష్టం అవుతోంది. ఎందుకంటే స్వప్న పక్కన వున్నవాడు డాక్టర్ గా కనబడటం లేదు. పైగా ఎవరో ఓ దుబాయ్ షేక్ లాగా కనబడుతున్నాడు. అందువలన ఈ వార్తని 100% గాసిప్ గానే పరిగణించవచ్చు. ఏమాత్రం ఫోటో ఎడిటింగ్ తెలిసిన వారికి ఆ ఫోటో మార్ఫింగ్ అని అర్ధం అయిపోతుంది.

Share post:

Popular