హీరోయిన్ పార్వ‌తి మెల్ట‌న్‌ను మోసం చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలా కనిపించే హీరోయిన్ లలో పార్వతి మెల్టన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మొదట వెన్నెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. శ్రీమన్నారాయణ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిందని చెప్పవచ్చు. ఇక కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా ఈమె గురించి పలు వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో పార్వతి మెల్టన్ ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు కెరియర్ మొదట్లో తాను పడిన కష్టాల గురించి వెల్లడించింది. నిజానికి పార్వతీమెల్టన్ అమెరికన్ సిటిజన్.. కానీ ఒక బడా డైరెక్టర్ , బడా హీరో ఇద్దరూ కలిసి.. తనకు తెలుగు పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పడంతో అమెరికాను వదిలి తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చేలా చేశారు.. అయితే సదరు డైరెక్టర్ కానీ..హీరో కానీ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వాడుకొని వదిలేశారని ఆమె తెలియజేసింది.

అవసరం తీరిపోయాక ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని.. ఇండస్ట్రీ పెద్దల కు తన అందాలే కావాల్సి వస్తే అమెరికాలోనే ఇచ్చేదాన్ని కదా ఆ పని కోసం మొత్తం తన జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు అని బాధపడింది. సినిమాలు అని తనను ప్రలోభాలు పెట్టకుండా ఉండి ఉంటే.. ఆమె ఇప్పటికే అమెరికాలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ రెండుచేతులా సంపాదించేదట.

ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకొని తన కొత్త జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపింది. అయితే పార్వతీమెల్టన్ ను చూసిన ఆమె అభిమానులు మాత్రం ఇంత అందంగా ఉంటే కష్టాలు తప్పవు అంటూ తెలియజేస్తున్నారు. అందుకే ఈ హీరోయిన్ కి అన్ని కష్టాలు అని చెప్పవచ్చు .కానీ ఆ హీరో , డైరెక్టర్ ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు పార్వతి మెల్టన్.

Share post:

Popular