టాలీవుడ్ లో మరో సంచలనం: దర్శకుడిగా మారిన యంగ్ హీరో..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లెటేస్ట్ సెన్సేషన్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ డైరెక్టర్ గా మారబోతున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే సిద్ధు కి ర‌చ‌న‌లో, సినిమా మేకింగ్‌లో మంచి ప‌ట్టుంది. ఆ టాలెంట్ ని ఆయన మంకు ఇది వరకే తన సినిమాల ద్వారా చూయించేశాడు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా స్క్రిప్టులో, మేకింగ్‌లో సిద్ధు చేసిన ఛేంజస్ కధకు కీల‌కంగా మారాయి. ఆ త‌ర్వాత సిద్ధూ “మా వింత గాథ వినుమా” కు కూడా ఆల్ మోస్ట్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి తనలోని స్పెషల్ టాలెంట్ ను బయట పెట్టాడు.

- Advertisement -

ఇక రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు సినిమా ఫస్ట్ హాఫ్ కి కూడా సిద్ధు మాట‌లు అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు స్క్రీన్ ప్లేలోనూ ఆయన భాగం పంచుకుని..సినిమా విజయాకిని కారణమైయ్యాడు. ఈ సినిమాతో నే ఫాంలోకి వచ్చాదుడు సిద్ధు. ఇప్పుడు ఆయన పేరు చెప్పితే కుర్రాళ్లు ఊగిపోతున్నారు. డీజే టిల్లు లో సిద్ధు చెప్పిన డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ స్ధాయిలో లాభాలను తెచ్చిపెట్టింది.

దీంతో డీజే టిల్లు పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నారు నిర్మాత నాగవంశీ. దీని పై అఫిషీయల్ ప్రకటన కూడా వచ్చేసింది. రేపో మాపో షూటింగ్ పనులు ప్రారంభిస్తారనే టాక్ మొదలైంది. కాగా, ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే ..డీజే టిల్లు 2 సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నాడట సిద్ధు. ఇప్పటికే గత సినిమా ఎక్స్ పీరియన్స్ లతో..ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడనే టాక్ మొదలైంది. అంతేకాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా హీరో తో కూడా ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డీజే టిల్లు 2 పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Share post:

Popular