ఆ త‌ప్పు వల్లే హీరో గోపీచంద్ కెరీర్ దెబ్బ‌తిందా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సరైన స్టార్డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు గోపీ చంద్ కూడా.. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా ఈయనకు రావాల్సిన ఫలితం అయితే లభించడం లేదు. కారణం తెలియదు కానీ సినిమాల ద్వారా ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు అయితే గోపీచంద్ సినీ కెరీర్లో ఎప్పుడూ లేవనే చెప్పాలి.

ఇకపోతే గోపీచంద్ కెరీర్ లో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా కారణం ఉందట. ఇకపోతే గోపీచంద్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆయన కెరియర్ ఇలా తప్పుదారిన పడింది అంటూ సినీ ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.. ఇక హీరోగా మంచి హైట్ లుక్స్ అన్ని ఉన్న గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయమై మెప్పించిన గోపీచంద్ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన నిజం సినిమా లో విలన్ గా అదరగొట్టేశాడు.

ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు.విలన్ గా మంచి క్లిక్ అయిన గోపీచంద్ వరుస అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆయన యూటర్న్ తీసుకుని హీరోగా మారిపోయారు. తనపై నమ్మకంతో దర్శకులు కూడా అవకాశాలు ఇచ్చి నష్టాన్ని చవి చూశారు. ఏ ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన సీటిమార్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇకపోతే విలన్ గా తన కెరీర్ ను కంటిన్యూ చేసి ఉంటే కచ్చితంగా నేడు సూపర్ స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకునే వారు గోపీచంద్. కానీ ఆయన హీరోగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రోజు తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Share post:

Popular