దేవి నాగవల్లిపై గెట‌ప్ శ్రీను అదిరిపోయే సెటైర్స్‌… సోష‌ల్ మీడియాలో షేకింగ్‌..!

గత నెలలో ప్రముఖ న్యూస్ టీవీ యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్‌ సేన్ మధ్య మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానల్ స్టూడియోలోకి వచ్చిన విశ్వక్‌ సేన్‌ను గెటవుట్ అంటూ దేవి నాగవల్లి ఫైర్ అయింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియో చేస్తే.. దానిపై ఈ ఛానల్ దేవితో ఓ డిబేట్ పెట్టించింది. ఆ డిబేట్‌కి విశ్వక్ సేన్ రావడంతో వారిద్దరి మధ్య గొడవ జరగింది.

- Advertisement -

ఈ గొడవలో చాలామంది దేవి నాగవల్లిదే తప్పు అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతుండగా తాజాగా గెటప్ శ్రీను మళ్లీ దానిపై ఒక స్కిట్ చేశాడు. ఈ స్కిట్‌లో శ్రీను దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జులై 8న హ్యాపీ బర్త్‌ డే అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ స్కిట్ చేసారు. దేవి నాగవల్లి పెట్టిన డిబేట్ కి ఇది ఒక పేరడీ వెర్షన్ అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

శ్రీను ఈ వీడియోలో న్యూస్ రీడర్‌గా కనిపించి న్యూసెన్స్ టీవీ అంటూ తనని తాను దేవి శ్రీ ప్రసాద్ థమన్ గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పేరడీ స్టూడియోలోకి వచ్చిన కమెడియన్ సత్యపై వాటర్ బాటిల్ విసిరాడు. ఇదే స్టూడియోకి హ్యాపీ బర్త్‌డే హీరో నరేష్ అగస్త్య కూడా విచ్చేశాడు. కాగా ఈ సినిమాలో నటించిన వెన్నెల కిషోర్ వీడియో కాల్ ద్వారా ఇందులో జాయిన్ అయ్యాడు. అనంతరం వీరందరూ ఈ సినిమాలో హీరో తామంటే తామే అని ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో లాగా పోట్లాడుకున్నారు.

ఈ క్రమంలో జబర్దస్త్ శ్రీను దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ సెటైర్స్ పేల్చాడు. మరోవైపు విశ్వక్ సేన్ లాగా వెన్నెల కిషోర్ ఇంగ్లీష్ లో ఒక బూతు పదం అర్థమయ్యి.. అర్థం కానట్లుగా చెప్పాడు. మొత్తంగా ఈ వీడియో దేవి నాగవల్లిని ట్రోల్ చేస్తూ చేసిన వీడియోలా అనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హ్యాపీ బర్త్ డే మూవీ మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఒక కామెడీ ఎంటర్టైనర్. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ పలువురు ఇతర రోల్స్‌లో యాక్ట్ చేశారు.

Share post:

Popular