సై లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా వదులుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాజమౌళి. దర్శకధీరుడిగా ఆయన బిరుదు పొందారు. అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుస్తూ ఉంటారు. తీసిన ప్రతి సినిమా హిట్ అయిన డైరెక్టర్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో రాజమౌళి తొలిస్థానంలో ఉంటారు. ఆయన తీసిన ప్రతిసినిమా బ్లాక్ బస్టరే.. ఆయనతో సినిమాలు తీసిన హీరోలకు కూడా స్టార్ డమ్ వచ్చేసింది. అందుకే రాజమౌళితో సినిమా చేయాలని ప్రతిఒక్క హీరోకు ఉంటుంది.

ఆయన సినిమాలో నటించాని ప్రతిఒక్క యాక్టర్ కి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే పాపులర్ అవ్వొచ్చనేది నటీనటులు అభిప్రాయం. టాలీవుడ్ లో నెంబర్ 1 డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా అయ్యాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది.

ఇతర దేశాల్లోని స్థానిక భాషల్లో కూడా బాహుబలి హిట్ అయిందంటే.. ఆ సినిమా ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఒకప్పుడు రాజమౌళి సినిమాను మిస్ చేసుకున్నాడట ఓ స్టార్ హీరో. నితిన్ హీరోగా వచ్చిన ‘సై’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రబ్బీ గేమ్ ఆధారంగా తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను తొలుత అప్పటి యంగ్ హీరో ఉదయ్ కిరణ్ తో చేయాలని రాజమౌళి అనుకున్నారట.

ఉదయ్ కిరణ్ ను సంప్రదించగా.. అతడు వేరే సినిమాలో బిజీగా ఉన్నాడు. దీంతో ఆ తర్వాత నితిన్ తో సై సినిమాని రాజమౌళి తెరకెక్కించాడు. సై సినిమాతో నితిన్ కు స్టార్ డమ్ దక్కింది. ఆ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో ఉదయ్ కిరణ్ ఆ సినిమాను మిస్ చేసుకున్నాడని, తీసి ఉంటే మరింత మైలేజ్ వచ్చేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Share post:

Popular