ఆ హీరోయిన్ కోసం ఏకంగా శ్రీదేవి నే పక్కన పెట్టిన ఎన్టీఆర్.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం.. ఇక తెలుగు పరిశ్రమకు మూల స్తంభం లాంటి ఆయనకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా విదేశాలలో సైతం ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అభిమానులలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మిగిల్చాయి.

సాంఘిక , పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలలో ఆరాధన చిత్రం కూడా ఒకటి.1976 మార్చి 12 వ తేదీన ఎన్.టి.ఆర్ హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరాధన . ఈ సినిమా విషయంలోనే ఎన్టీఆర్ అతిలోక సుందరి శ్రీదేవిని కూడా పెట్టడం జరిగింది.

ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన పుండరీకాక్షయ్య, దర్శకుడు బి.వి.ప్రసాద్ ఎన్టీఆర్ పక్కన మొదట జయప్రదను అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి ని కూడా ఎన్టీఆర్ సరసన నటింపజేయాలని అనుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ పట్టుబట్టి మరి వాణిశ్రీ కి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు వాణిశ్రీ ముఖకవళికలను చూసి ఆమె నటనకు ఫిదా అయిన ఎన్టీఆర్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈమె అయితేనే న్యాయం చేస్తుందని భావించి ..ఆమెను తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఒక మైలురాయిగా ఈ చిత్రం మిగిలిపోయింది.