వామ్మో మహేష్ – త్రివిక్రమ్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా..?

మహేష్ బాబు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇకపోతే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు , ఖలేజా వంటి సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అలా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో మళ్లీ మహేష్ బాబు, త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ ఒక పవర్ఫుల్ కథ తో త్రివిక్రమ్ కొన్ని నెలల పాటు మహేష్ బాబు చుట్టూ తిరిగి ఎట్టకేలకు ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారు.

మూడో సారి వస్తున్న ఈ కాంబినేషన్ పై అభిమానులలో మరింత ఉత్కంఠ నెలకొంది. సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాతో సక్సెస్ కొడతాడా లేదా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇకపోతే భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక జూన్ నెల నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా.. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతోంది.కానీ అంచనాల ప్రకారం సుమారుగా 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ఇక 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని.. అందులో 120 కోట్ల రూపాయల వరకు పారితోషికం కోసమే ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇక అంతే కాదు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 150 కోట్లకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉండగా.. నాన్ థియేట్రికల్ హక్కులకు 150 కోట్ల రూపాయల వరకు అమ్ముడుపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిర్మాతల గనుక ఈ ఆఫర్ కు ఒప్పుకుంటే రిలీజ్ కి ముందే రూ.100 కోట్లకు పైగా లాభం వచ్చినట్లే.

Share post:

Popular