చంద్రబోస్ భార్య సుచిత్ర బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ప్రముఖ టాలీవుడ్ పాటల రచయితగా పేరు పొందిన చంద్రబోస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు రాసి.. ఎంతో అద్భుతమైన పాటలు అందించారు. ఇక వరంగల్ కి చెందిన చంద్రబోస్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా తనకు పాటల మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో అటు వైపు అడుగులు వేయడం జరిగింది.

మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన తాజ్ మహల్ అనే చిత్రానికి మంచుకొండల్లో చందమా చందనాలు అనే పాటను రాశారు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా లో కూడా పాటలు రాసే అవకాశం దక్కించుకుని ..సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపీటలు అనే పాటలు రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఇక ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సుచిత్ర, చంద్రబోస్ కి మధ్య పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ టు చెన్నై కి కలిసి ఎన్నో సార్లు ప్రయాణం చేసారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇక మొదట చంద్రబోస్ సుచిత్ర కు ప్రపోజ్ చేయడం జరిగింది.మొదట ఆమె అంగీకరించలేదు.. కానీ చంద్రబోస్ మాత్రం తనది టైం పాస్ లవ్ కాదని.. ప్రేమ గురించి పూర్తిగా వివరించారు. అలా వారిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.

కానీ చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు వయసులో పెద్దది కావడం గమనార్హం. వివాహానికి వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు. మొత్తానికి అయితే వారిద్దరి వివాహం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు సుచిత్ర . ముఖ్యంగా మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, గోపాలగోపాల , అన్నమయ్య వంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. సినీ ఇండస్ట్రీలో ఈమెకి కొంతమంది బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం.

Share post:

Popular