ఈ స్టార్ హీరోయిన్లు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారో తెలుసా… !

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోహీరోయిన్లు కాస్త లేటుగానే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం చాలా ఆలస్యంగా, కొందరు మాత్రం చాలా తొందరగా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. వీరికి పెళ్లయినప్పుడు వారి వయసు ఎంతో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్‌ను జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు దాటింది. 37 ఏళ్ల అంటే మామూలు విషయమా! మరో ఆసక్తికర నిజమేమిటంటే, విగ్నేష్ కంటే నయనతార పది నెలలు పెద్దది.

కాజల్ అగర్వాల్
అందాల చందమామ కాజల్ 2020లో గౌతమ్‌ కిచ్లుతో వివాహ బంధంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అప్పుటికి కాజల్ వయసు 35 ఏళ్లు.

శ్రియ శరణ్
ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్ 2018లో రష్యా వ్యాపారవేత్త ఆండ్య్రూని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ సమయానికి ఈ ముద్దుగుమ్మకు 36 ఏళ్లు.

ప్రణీత సుభాష్
బాపుగారి బొమ్మ, అందాల ముద్దుగుమ్మ ప్రణీత 2021లో నితిన్ రాజుని పెళ్లాడింది. అప్పుడు ఆమె వయసు కేవలం 28 ఏళ్లే. ఒక హీరోయిన్ అయి ఉండి ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యకర విషయమే.

ఆలియా భట్
బాలీవుడ్ బడా హీరో రణబీర్ కపూర్‌ను ఇటీవలే ఆలియా భట్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ చేసుకునే సమయానికి ఈ క్యూట్ హీరోయిన్‌ ఏజ్ 29 ఏళ్లు.

నజ్రియా నజీమ్
ఎక్స్‌ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్ అతి పిన్న వయసులోనే ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్‌ని వివాహం చేసుకుంది. ఆగస్టు 21, 2014న వీరి పెళ్లి జరిగింది. అప్పటికి నజ్రియా నజీమ్ వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.

జెనీలియా
హ హ హ హాసిని అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని ముద్ర వేసిన జెనీలియా తన 24వ ఏట పెళ్లిపీటలు ఎక్కింది. మహారాష్ట్ర మాజీ సీఎం కుమారుడు, హీరో రితేష్ దేశముఖ్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది.

అదితి రావు హైదరి
రాజ వంశీకురాలు, ప్రముఖ నటి అదితి రావు హైదరి తన 21 ఏళ్ల వయసులోనే మాజీ భారతీయ న్యాయవాది, నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అయితే ఆమె తన వివాహాన్ని సీక్రెట్‌గా ఉంచుతుంది. 2009 నుంచి 2013 వరకు వీరిద్దరూ కాపురం చేసి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.

Share post:

Latest