నరేష్ ప్రేమలో పవిత్ర ఎలా, ఎప్పుడు పడిందో తెలుసా !

టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్… కన్నడ, తెలుగు టీవీ, సినిమా యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ చిగురించిందని ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారని కొద్దిరోజులుగా అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒక ఆలయంలో ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించారనే విషయం బయటకు వచ్చిన సమయం నుంచి ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.

- Advertisement -

అవన్నీ పెటాకులు అయ్యాయి. పవిత్ర లోకేష్ కూడా ఇప్పటికే ఫిలిం, టీవీ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏదో మనస్పర్ధలు రావడంతో పవిత్ర, సుచేంద్ర కొన్నేళ్లుగా వేరువేరుగానే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారో లేదో తెలియదు. పవిత్ర నరేష్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై అటు నరేష్ గానీ ఇటు పవిత్ర గానీ అధికారికంగా స్పందించలేదు.

నరేష్ ఇటీవల భారతీయ వివాహవ్యవస్థే ఒక తప్పు అని వ్యాఖ్యానించాడు. అలాంటప్పుడు నాలుగో పెళ్లి చేసుకోవడం ఎందుకు అని కౌంటర్ కామెంట్స్ కూడా వినిపించాయి. నిజానికి వీరిద్దరి మధ్య 19 ఏళ్ల గ్యాప్ ఉంది. నరేష్ వయసు 62 అయితే, ఈ కేరళ కుట్టి వయసు 43 ఏళ్లు. మరి తన కంటే దాదాపు 20 ఏళ్ల వయసులో ఉన్న నరేష్‌తో ఈమె ఎలా, ఎప్పుడు ప్రేమలో పడింది? అనే దాని గురించి ఇప్పుడు సినిమా వర్గాల్లో ఒక టాపిక్ నడుస్తోంది.

అదేంటంటే, నరేష్ పవిత్ర కలిసి 10 సినిమాల్లో నటించారు. ఇలా నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ టాక్. నరేష్ వ్యక్తిత్వం నచ్చడంతో వయసుతో సంబంధమేముందని ఆమె అతనితో సహజీవనం ప్రారంభించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవిత్ర గురించి ప్రస్తుతం ఇంకొన్ని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. అదేంటంటే పవిత్ర ఈటీవీ కన్నడ ఛానల్లో 2003 నుంచి ప్రసారమైన గుప్తగామిని అనే సీరియల్‌లో నటించింది.

ఆ సమయంలోనే హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయిని పవిత్ర పెళ్లాడిందని అప్పట్లో కన్నడ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఆ కథనాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పెళ్ళాడిన పవిత్ర హైదరాబాదు తరచూ వస్తూ ఉండేదట. అలాగే టీవీ సీరియల్స్, సినిమాల్లో కొనసాగుతూ తన ప్రొఫెషనల్ కెరీర్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చేదట. ఇందుకోసం ఎక్కువగా బెంగళూరు వెళ్లలేదట.

అయితే ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, దీంతో వీరు కేవలం ఒక్క ఏడాదిలోనే విడిపోయారని టాక్. పవిత్ర తండ్రి కూడా ఆల్రెడీ పెళ్లి అయిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సర్వమంగళతో వెళ్లిపోయాడని అంటుంటారు. పవిత్రకి ముందుగానే పెళ్లి అయినట్లు సుచేంద్రకు కూడా పెళ్లి అయ్యింది. ఈ పెళ్లిళ్ల విషయాలన్నీ ఇప్పుడు సినీ ప్రేక్షకులకు తల తిరిగేలా చేస్తున్నాయి.

Share post:

Popular