ఆ హీరోకి డిస్నీ బహిరంగ క్షమాపణ..2355 కోట్ల ఆఫర్‌ ఇస్తూ సంచలన ప్రకటన..!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవ్వరు చెప్పలేరు. మన టైం బాగోలేకపోతే ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలి. కానీ, ఒక్కటి నిజం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన పనిలేదు..అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిజం నిప్పులాంటిది అది ఎప్పటికైన బయట పడాల్సిందే. ఆ టైంలో గతంలో మనల్ని నిందించిన వాళ్లు..తప్పు తెలుసుకుని క్షమాపణలు అడగక తప్పదు.

ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఏర్పడింది హాలీవుడ్‌ నటుడు జానీ డెప్‌ కి. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్‌ ఫాలో​యింగ్‌ ఉన్న అతి కొద్దిమంది సెలబ్రిటీలల్లో ఈ హాలీవుడ్‌ నటుడు జానీ డెప్‌ ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి ఆయన తన ఒరిజినల్ పేరు జానీ డెప్‌గా కంటే కూడా.. కెఫ్టెన్‌ జాక్‌ స్పారోగానే అభిమానులకు బాగా తెలుసు. ఆయన ని చాలా మంది అలానే పిలుస్తుంటారు. జానీ డెప్‌ నటించిన ‘పైరెట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌’ సిరీస్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

పైరెట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌’ సిరీస్‌లోని ‘సల్జెర్స్‌ రివెంజ్‌’ సినిమా తర్వాత జానీ డెప్‌ కు అనుకుని సమస్య వచ్చి పడ్డింది. తన తప్పు లేకున్న ఊహించని చిక్కుల్లో చిక్కుకున్నాడు. తన భార్య ఆంబర్‌ హియర్డ్‌తో కోర్టు వివాదాల నేపథ్యంలో ఆయన ఈ సిరీస్‌ నుంచి తప్పించబడ్డాడు. దీంతో పైరెట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌’ సిరీస్‌ నిర్మాణ సంస్థ డిస్నీ జానీపై నిషేధం కూడా విధించింది. ఇది అప్పట్లో ఓ సంచలనం గా మారింది. పెద్ద దుమారమే రేగింది. అయితే, ఫైనల్ గా ఈ కేసులో నిర్ధోషి గా బయటపడ్డాడు జానీ డెప్‌. దీంతో జానీ డెప్‌ కి బహిరంగ క్షమాపణ చెప్పుతూ ఆయన పై పెట్టిన నిషేధాన్ని ఎత్తేస్తూ..డిస్నీ సంచలన ప్రకటన చేసింది . తమ నిర్మాణ సంస్థలో జాక్‌ స్పారోగా మళ్ళీ నటించాలని కోరుతూ..ఏకంగా 2355 కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసింది. అయితే, ఈ ఆఫర్‌ పై జానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

Share post:

Popular