పాన్ ఇండియా ఏంటి నా పిండా కూడు..మ‌గ‌త‌నం అంటే అది.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం ఎక్కువుగా వినిపిస్తుంది. ఇప్పుడు పేరున్న హీరో..ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో అందరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో నే తమ సినిమాలు తెరకెక్కాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి పాన్ ఇండియా సినిమాల పై పేముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి ఆయన మాటాలు.

తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడేస్తారు. తప్పు చేస్తే ఎదుటవారిని సూటిగా ప్రశ్నించచడం ..ఆయన వ్యక్తిత్త్వం. మనసుకు ఎదై అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అందుకే కాబోలు ఆయనతో మాట్లాడటానికి చాలా మంది జంకుతారు. అయితే, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ నేటి తరం పాన్ ఇండియా సినిమాల పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

“పాన్ ఇందియా సినిమాలు అంటే..అప్పట్లో NTR, ANR గారు చేసేవే అవి. మన వాళ్లు ఎప్పుడో పాన్ ఇండియా సినిమా లు చేసారు. దాని ఏంటో ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. అస్సలు పాన్ ఇండియా అంటే..ఐదు భాషలల్లో సినిమాను నేరుగా తెరకెక్కించడం. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు భానుమ‌తిగారి డైరెక్ష‌న్‌ అండ్ ప్రొడ‌క్ష‌న్‌లో “చంఢీ రాణి” అనే సినిమాను నేరుగా ఐదు భాష‌ల్లో షూటింగ్ చేశారు. దానే పాన్ ఇండియా మూవీ అంటారు. దానే మగతనం అంటారు. పైగా అప్పట్లో నార్త్ లో NTR పేరు తెలియకుండానే ఆయన సినిమాలు అక్కడ డబ్ చేస్తే..మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా జెట్ స్పీడ్ కంటే వేగంగా పోతుంది. ఒక్క భాషలో సినిమాలు తీసి..దాని వేరోక భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం..పాన్ ఇండియా సినిమా కాదు. ఇప్పుడు పాన్ ఇండియా ఏంటి నా పిండా కూడు..అప్ప‌ట్లో వ‌చ్చినవే పాన్ ఇండియా సినిమాలు” అంటూ కామెంట్స్ చేసారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Popular