“నోరు అదుపులో పెట్టుకో..పద్ధతులు నీ దగ్గరే నేర్చుకోవాలి”..బండ్లన్న కి పూరీ ఘాటు కౌంటర్..?

యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. మన పెద్ద వాళ్లు చెప్పుతుంటారు..తొందరపడి ఒక్క మాట మాట్లాడాకూడదు. ఆ మాట తాలుకా ఎఫెక్ట్ తరువాతి రోజుల్లో కనిపిస్తుంది అని. అయితే, ఆ ఎఫెక్ట్ బండ్ల గణేష్ కు కూసింత తొందరగానే పడింది. రీసెంట్ గా పూరీ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం..”‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చాడు నిర్మాత బండ్ల గణేష్.

మనకు తెలిసిందే ఏ ఈవెంట్ లో నైనా..బండ్లన్న స్పీచ్ హైలెట్ గా నిలుస్తుంది. కొందరు అడిగి మరి ఆయనను స్పెషల్ గా పిలిపించుకుని మరీ స్పీచ్ ఇప్పించుకుంటారు. అంత పవర్ ఉంది ఆయన మాటలకి. ఆయన మైక్ పట్టుకుని..స్టేజీ పై మాట్లాడుతుంటే..క్రింద ఉన్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ రావాల్సిందే. అలా ఉంటాది బండ్లన్న తో యవ్వారం అంటే. అయితే, ఈసారి మరో సరికొత్త స్టైల్ ని ఫాలో అవుతూ..స్టేజీ పైనే దర్శకుడు పూరికి గట్టిగా క్లాస్ పీకాడు. దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది.

స్టేజీ పైన ఆయన మాట్లాడుతూ..” మా అన్న ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో..నీ డైరెక్షన్ లో..ఎంతమందినో స్టార్లను చేశావ్.. సూపర్ స్టార్లను కూడా చేశావ్.. ఇంకా పక్కాగా చెప్పాలంటే డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి దగ్గరుండి ఎలా డైలాగ్‌లు చెప్పాలో కూడా నేర్పించావ్. ఇన్ని చేసిన నువ్వు..నీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. పెద్ద తప్పు చేశావ్ అన్న. అదే నేను నీ ప్లేస్లో ఉండి ఉంటే.. లండన్‌లో ఉన్నా సరే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పరిగెత్తుకుంటా వచ్చేసే వాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా పిల్లల కోసం.

ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. అది నీ బాధ్యత” అంటూ తన దైన స్టైల్ లో మాట్లాడాడు. దీంతో ఈ మాటాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఏమో “బండలన్న చెప్పింది కరెక్ట్ నే గా అంటుంటే”..మరికొందరు..”బండ్లన్న కి నోటి దురద ఎక్కువే..పూరికి తన కొడుకు గురించి లేని దిగులు..ఈయనకు ఎందుకో..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై పూరీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. “మాటలు మార్చే ఊసరవెళ్లి నువ్వు..పూరీ కి నీతులు చెప్పుతున్నావా” అని కొందరు..”నోరు అదుపులో పెట్టుకో అని మరి కొందరు” ఆయనపై మండిపడుతున్నారు. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం, పూరీ కూడా బండ్లకు కాల్ చేసి గట్టి కౌంటర్ లే ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తన కొడుకు సినిమా కి నెగిటివ్ టాక్ రాకుడదని సైలెంట్ అవుతున్నట్లు కూడా చెప్పారట. మాటల సంగతి ఎలా ఉన్నా..మొత్తానికి సినిమాకి మాత్రం మంచి పబ్లిసిటీ ఇచ్చాడు బండ్ల గణేష్.

Share post:

Popular