ప్రేమకి, కామానికి మధ్య తేడా తెలుసా..ఎలా గుర్తించాలంటే..?

ప్రేమ..రెండంటే రెండే అక్షరాలు ..కానీ, ఇది ఇచ్చే అనుభూతి..మిగిల్చే బాధ వర్ణాతీతం. ప్రేమ ..బ్లైండ్, చాలా విలువైనది, అందరికి దక్కదు..ఇలా చాలా సినిమాటిక్ డైలాగ్స్ వినుంటారు. కానీ, అవి ఏవి నిజం కాదు. అస్సలు ప్రేమ ఎలా ఉంటుంది, ఎప్పుడు పుడుతుంది..ఎవ్వరి పై పుడుతుందో మనకే తెలియదు. అది ఓ ఫీలింగ్. స్వఛమైన , పవిత్రమైన ఫిలింగ్ అంతే. అయితే , నేటి తరం పిల్లలు ఈ ప్రేమ అనే పదం చెప్పుకుని..అసభ్యకార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దానిని ప్రేమ అనరు. కామం అంటారు. ఆ కామ కోరికలు తీర్చుకోవడానికే ..కొందరు యువత..దానికి ప్రేమ అనే పేరుని అడ్డుపెట్టి..ప్రేమ కు ఉన్న వాల్యూ తీస్తున్నారు.అస్సలు ప్రేమ, కామానికి మధ్య తేడా ఏంటి..?..మనం అస్సలు ప్రేమలో పడ్డామా..లేక, కామంలో ఉన్నామా..? ఎలా గుర్తించాలి. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం రండి..!!

ప్రేమ ఎవ్వరి పైన అయిన పుట్టవచ్చు. అమ్మ,నాన్న,అక్క,చెల్లి,తమ్ముడు, ఇలా అందరిని మనం ప్రేమిస్తాం కానీ, రొమాంటిక్‌ లవ్‌ మాత్రం..ఒక్క అబ్బాయికి..అమ్మాయిని చూసినప్పుడు..అమ్మాయికి అబ్బాయిని చుసినప్పుడు మాత్రమే పుడుతుందట. ఇదే విష్యాని రాట్‌కర్స్ యూనివర్సిటీ చెందిన హెలెన్ ఇ.ఫిషర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ రొమాటిక్ లవ్ లో మూడు రకాలు ఉంటాయట. కామం,ఆకర్షణ,వ్యసనం..!!!

కామం:
ప్రేమలో ఈ కామం ముందు వరసలో ఉంటుందట. అయితే, అన్ని సందర్భాలలో అలా ఉంటుందని చెప్పలేం కానీ..చాలా విషయాలల్లో ఈ కామం.. మనం ఇష్టపడే వారి పై ఎక్కువుగా ప్రభావం చూపుతుందట. నిజానికి కామం అనేది ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ల వంటి హార్మోన్లు చూపించే ప్రభావం అని మనం కాలేజీల్లో చదువుకునే రోజుల్లోనే చదివి ఉంటాం. ఇది టోటల్ గా బాడీ కి సంబంధించింది.. ఇది సెక్స్ చేయాలనే కోరికను కలిగిస్తూ ఉంటుంది.

ఆకర్షణ:
మనం ఎవ్వరినైన చూడగానే..అబ్బా, అమ్మాయి చాలా బాగుంది, లేదా..వావ్, కుర్రాడు బాగున్నాడు అని..మనకు తెలియని వాళ్ళను కూడా చూసి అంటుంటాం. అదే ఆకర్షణ. ఇది డోపమీన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రభావితమవుతుంది. ఇది మన మెదడులో విడుదలయ్యే జీవ రసాయనం. ఈ ఆకర్షణ పనే ఎదుటి వారి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోమని మనల్ని ముందుకు నెడుతుంటుంది . నేటి కాలంలో చాలా మంది యువత దీనే ప్రేమ అనుకుని మోసపోతున్నారు.

ప్రేమే వ్యసనం:
ఇలాంటి వాళ్లను మనం ఈ జనరేషన్ లో ఎక్కువుగా చూస్తుంటాం. నేటి కాలంలో అయితే, లవ్ లో ఫెయిల్ అయితే ఏం చేయాలి రా అంటే..ఏముంది..ఒక అమ్మాయిని మర్చిపోవడానికి..మరో అమ్మాయిని వెత్తుకుంటాం అంతే..అని చెప్పే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రేమను సీరియస్ గా తీసుకునే అమ్మాయిలు,అబ్బాయిలు ఈ రోజుల్లో చాలా తక్కువ.ఓవర్ఆకర్షణ అనే భావన మనిషిని ప్రేమ పట్ల ఓ వ్యసనపరుడిగా మార్చేస్తుంది. దీంతో డోపమీన్ ప్రేరేపణల కారణంగా కొత్త సంబంధాలు, రోజుకో కొత్త థ్రిల్, కొత్త ప్రేమ కో సం వెతుకులాడుతుంటారు. అంటే వీరు ప్రేమకు బానిసలని అర్థం. రోజుకో కొత్త ప్రేమను టేస్ట్ చేయ్యలని చూస్తుంటారు. ఇదే రొమాంటిక్ లవ్‌కు సంబంధించిన మూడో అంశం.

చాలామంది ప్రేమలో పడుతుంటారు. ప్రతిరోజూ అలాగే ప్రేమలో మునిగిపోవాలని..జాలీగా ఉండాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే వాళ్లల్లో డోపమీన్ ఎక్కువుగా ఉంటుంది..వాళ్ళను ముంచెత్తుతూనే ఉంటుంది. అప్పుడు మీ మెదడు మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తోందని అర్థమట. ఫైనల్లీ..ఒక్కే ఒక్క మాట..”నిజమైన ప్రేమ కామానికి బలి అవ్వదు..కామం లో పూటే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు”..అనే సత్యమును గ్రహించినవాళ్ళే అసలైన ప్రేమను ఎంజాయ్ చేయగలరు.

Share post:

Popular