రాజ‌శేఖ‌ర్‌కు కూతురుకు అదే దెబ్బ‌డిపోతోందా… పెద్ద మైన‌స్ అయ్యిందే..!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, నటి జీవిత కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో శివాత్మికకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి కలిసి కల్కి సినిమాని ప్రొడ్యూస్ చేసింది. 2021లో తమిళంలో ఓ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

ఆ తర్వాత తెలుగులో రంగమార్తాండ అనే సినిమాలో నటించింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అనసూయ, రమ్యకృష్ణ నటించడం విశేషం. అయితే శివాత్మిక సినిమాల్లో మంచి హీరోయిన్‌గా ఇంకా పేరు తెచ్చుకోవడానికి ఒకటే కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేంటంటే శివాత్మిక ఎప్పుడూ కూడా యూత్ కి అస్సలు నచ్చని పాత్రల్లోనే నటిస్తోంది. అందులోనూ ఆమె ఎంచుకునే కథలు కూడా కమర్షియల్ గా హిట్ అందుకునేలా ఉండటం లేదు.

ఉప్పెన, ఏక్ మినీ కథ వంటి కమర్షియల్ సినిమాల్లో నటిస్తే ఆమెకు ఎక్కువగా పేరు రావడంతో పాటు హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ ఆమె మాత్రం పాతకాలం వారిని ఆకట్టుకునేలా ఉండే సినిమాల్లో మాత్రమే నటించడానికి సిద్ధమవుతోంది. అలా కాకుండా ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తే ఆమె అందానికి తగ్గ గుర్తింపు దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరి అప్‌కమింగ్ సినిమా రంగమార్తాండతోనైనా ఆమెకు గుర్తింపు లభిస్తుందో లేదో చూడాలి. శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలను చూపిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఈ అకౌంట్‌లో ఆమె తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

Share post:

Popular