నటి ప్రగతి ఆంటీ ఒక్క రోజు పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి ప్రగతి ఆంటీ. నటీనటులకు అమ్మ పాత్రలో నటించడం ద్వారా ఈ నటి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఎఫ్-3 చిత్రంతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో ఈమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ప్రగతి సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఈమె జిమ్ వీడియోలు, డాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి.
అయితే ప్రస్తుతం ప్రగతి ఆంటీ ఒక రోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై ఎక్కువగా సర్చ్ చేయడం జరిగింది. కొన్ని మీడియా సమాచారం ప్రకారం ఈమె రెమ్యూనరేషన్ రోజుకి రూ.72,500 రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ రెమ్యునరేషన్ సినిమాను బట్టి ఉంటుందని తెలుస్తోంది. కొన్ని చిత్రాలకు మాత్రం రోజువారి పారితోషకం కాకుండా సినిమాకు ఇంత అని తీసుకుంటున్నట్లు గా వినిపిస్తోంది.

ఈమె నటిస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఈమెకు అవకాశాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక తన తదుపరి సినిమాల ద్వారా కూడా ఈమె విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక గతంలో కూడా ప్రగతి ఆంటీ క్యాస్టింగ్ కౌచ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈమె పలు సీరియల్స్లో కూడా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈమె నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్నది. ప్రగతి ఆంటీ ఎక్కువగా అమ్మ అక్క , వదిన, పాత్రలో నటిస్తూనే ఉన్నది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల తగ్గడంతో ఈమె కు బాగా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

Share post:

Popular