ఆ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన బాలకృష్ణ… పెళ్లి ముంగిట ఆగిన ప్రేమ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ చూసేందుకు చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఫ్యాన్స్‌పై చేయి చేసుకుంటూ అప్పుడప్పుడు అందరికీ హడల్ పుట్టిస్తాడు. అయితే బయట ప్రపంచానికి అతను అలా మాత్రమే తెలుసు. కానీ బాలయ్య మనసు బంగారం అని సన్నిహితులు చెబుతుంటారు. బాలకృష్ణ చిన్నపిల్లవాడి మనస్తత్వం కలవాడు అని, చాలా మంచోడని, మనసులో ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేస్తాడని అతనికి దగ్గరైన వాళ్లు కూడా అంటుంటారు. ఇక డైరెక్టర్లకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం, డైలాగ్ రైటర్లకు అయితే ఇంకా ఇష్టం.

ఇలా తనకి దగ్గరైనా వాళ్లందరికీ ఈ అఖండ స్టార్ ప్రేమను పంచుతూ, పొందుతూ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే బాలయ్య ఒకరి ప్రేమను లైఫ్ లాంగ్ పొందాలనుకున్నాడట కానీ అది మాత్రం సాధ్యం కాలేదట. బాలయ్య ప్రేమ భగ్నం కావడానికి వారిద్దరే కారణమని ఓ ఇంటర్వ్యూలో ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కూడా చెప్పుకొచ్చారు. బాలయ్యకి ఒక లవ్‌స్టోరీ ఉన్నట్లు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రోగ్రామ్‌లో శ్రీ రాపాక అనే కంటెస్టెంట్ కూడా చెప్పింది.

శ్రీ రాపాక గతంలో బాలకృష్ణ దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఈ సమయంలోనే లెజెండ్ స్టార్ తన పర్సనల్ విషయాలను చాలా పంచుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఆయన తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పినట్లు తెలిపింది. సినిమా హీరోయిన్ ప్రేమించినట్లు తెలిపారని చెప్పింది కానీ ఆ హీరోయిన్ పేరు ఏంటో మాత్రం వెల్లడించలేదు. నాదెండ్ల భాస్కర్ బాలయ్య లవ్ స్టోరీ గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు.

బాలకృష్ణ యుక్తవయసులో ఉన్నప్పుడు ఒక మద్రాస్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించాడని.. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఎన్టీఆర్, హరికృష్ణకు తెలిసినప్పుడు వారి చాలా కోప్పడ్డారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ఎట్టిపరిస్థితిలోనూ చేసుకోనివ్వమని తేల్చిచెప్పడంతో బాలకృష్ణ తన ప్రేమను త్యాగం చేశాడట. ఆ వెనువెంటనే ఎన్టీఆర్ తన బంధువుల అమ్మాయి అయిన వసుంధరాదేవితో బాలకృష్ణ పెళ్లి జరిపించారు.

అయితే బాలయ్య ప్రేమించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు ఖుష్బూ అని మూవీ ఇండస్ట్రీలో అంటుంటారు. కానీ ఈ మాటల్లో ఎంత నిజముందనేది తెలియదు. అప్పట్లో కుష్బూ తన అందచందాలతో తమిళ ప్రజల హృదయాల్లో కలల రాణిగా గిలిగింతలు పెట్టింది. ఆ రోజుల్లో ఆమె కోసం ఒక గుడి కూడా కట్టారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మపై బాలయ్య ప్రేమ పెంచుకున్నారని కానీ కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదని భోగట్టా. ఏది ఏమైనా బాలయ్య లవ్ స్టోరీ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది.

Share post:

Popular