ఆది పినిశెట్టి కి కోలుకోలేని దెబ్బలు..వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ..ప్రముఖ జోతిష్య పండితులు వేణు స్వామి..ఈ మధ్య ఎక్కువుగా పాపులర్ అయిన స్టార్స్..కొత్త పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ జాతకాల గురించే చెప్పుకొస్తున్నారు. గతంలో ఈయన చెప్పినవి అన్ని అలాగే జరిగాయి. అందుకే ఈయన మాటలను అందరు పక్కాగా నమ్ముతారు. ఈయన మాటల పై విశ్వాసం ఉంచుతారు.

గతంలో చంద్రబాబు నాయుడు, సమంత, నాగ చైతన్య జీవితాలల్లో ఆయన చెప్పింది చెప్పిన్నట్లు జరిగింది. అందుకే, ఈయన మాటలను అందరు గట్టిగా నమ్ముతున్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్, కొత్త జంట నయన్-విగ్నేశ్, రష్మిక, తమన్నా..ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన సేమ్ ఇప్పుడు అలాగే..న్యూ స్టార్ కపుల్..ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానీ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొంత కాలం ప్రేమించుకుని ..మే18న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట జాతకల పై వేణు స్వామి మాట్లాడుతు..షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని..ఆయన జాతకాని నిక్కీ జతాకంతో పోల్చితే షష్టాష్టకాలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు.దీని కారణంగా వీళ్ళ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురుకోక తప్పదని హెచ్చరించారు. దానికి తగిన పరిహార పూజలు చెయ్యాల్సిందే లేకపోతే..వీళ్ళ వైవాహిక జీవితంలో ఎదురు దెబ్బలు తప్పవన్నారు. ప్రేమ అనే మైకంలో పెళ్లి చేసుకున్నా..పరిహార పూజాలు చేసుకోకపోతే..ఖచ్చితంగా ఆది తీవ్ర సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. వాళ్ళు విడిపోవాలని కోరుకోవట్లేదని ..కానీ, వాళ్లు జాతకాల పై దృష్టి పెట్టకపోతే ..భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Share post:

Popular