దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించకపోవడానికి కారణం వారేనా..?

దేవీ శ్రీ ప్రసాద్.. మ్యూజిక్ ప్రపంచంలో రాక్ స్టార్ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ పాటలను అందించారు. తన మ్యూజిక్ తో కుర్రాల నుంచి పెద్దవారి వరకు స్టెప్పులు వేయించగలిగే గొప్ప సంగీత దర్శకుడు అని చెప్పవచ్చు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే అందరి హీరోల సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అయితే కొంతకాలంగా ఆయన కెరియర్ కొంచెం డౌన్ అయినట్లు తెలుస్తోంది . వరుస సినిమాలు చేయాల్సిన దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ పుష్ప సినిమా ఆల్బంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు యూట్యూబ్ ని ఒక రేంజ్ లో షేక్ చేశాయి. ఇక ఈ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక దేవిశ్రీప్రసాద్ ఆడియో ఫంక్షన్లో ఎంతో హుషారుగా కనిపిస్తారు అన్న విషయం తెలిసిందే. చూడడానికి స్టైలిష్ లుక్ తో ఫుల్ జోష్ మీద ఉండే దేవి శ్రీ ప్రసాద్ హీరో గా కూడా మంచి సక్సెస్ అవుతారు అని అనుకున్నారు. అంతేకాకుండా ప్రముఖులు సైతం దేవిశ్రీప్రసాద్ హీరోగా ఓ సినిమా చేయాలని కోరుకున్నారు.

ఈయన కూడా హీరోగా నటించడానికి సిద్ధం అయ్యాడు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న తనను ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అన్న అనుమానం ఆయనకు వచ్చిందట. దాంతో సన్నిహితులను అడగగా..వారు ఆయనతో ఒకవేళ అదే కనుక జరిగితే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా కెరియర్ దెబ్బతింటుందని హెచ్చరించారు. అందుకే హీరోగా తన కెరీర్ ను కొనసాగించకుండా మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగించాలని పునరాలోచన చేసినట్లు సమాచారం.

Share post:

Popular