వివాహమైన తర్వాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే ఈ సమస్యలు తప్పవా..?

ఒకప్పుడు పెళ్లి అయిన వెంటనే భార్య భర్తలు పిల్లలను కనేందుకు చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు వివాహం చేసుకొని కొద్ది రోజులు తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. కనీసం ఒక ఏడాది కానిదే పిల్లలు కనడానికి ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. మరికొందరైతే రెండు, ముడు ఏళ్లు అయినా కూడా బాగా తమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.

అయితే వివాహమైన తర్వాత పిల్లలకోసం ప్లాన్ చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. లేదంటే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. వివాహమైన తరువాత కొంతమంది ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కొన్ని టాబ్లెట్లను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇలా టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గర్భానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు పెళ్లిళ్ల వయసు 30 సంవత్సరాలు దాటిన తర్వాతనే అందరూ ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇంకా వయసు పెరిగేకొద్దీ అండం, శుక్రకణాల ఉత్పత్తి లో పలు మార్పులు వల్ల పిల్లలు పుట్టక పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట. ఇక మహిళలు సరైన వయసులో ఉన్నప్పుడే పిల్లలకు జన్మ నిస్తే.. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆలస్యంగా పుట్టే పిల్లలకు పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

వివాహం తర్వాత పిల్లలు కనేందుకు టైం తీసుకున్నట్లు అయితే చుట్టుపక్కల వాళ్లు అనే మాటలతో ఎంతో మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు వివాహమైన తర్వాత ఎప్పుడు కలిగితే అప్పుడు కనాలి అనుకోకుండా వైద్యులను సూచించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తమ కెరీర్ కోసం వాయిదా వేస్తే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.

Share post:

Latest