పూరి దంప‌తుల విడాకులు… సంచ‌ల‌న మ్యాట‌ర్‌పై క్లారిటీ…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్.. ఆయన సతీమణి లావణ్య ఇద్దరూ కూడా విడిపోతున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారని పలు వెబ్ సైట్స్ లో వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే గతంలో కూడా హీరోయిన్ ఛార్మి కారణంగానే లావణ్యకు పూరి జగన్నాథ్ విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు పెద్దఎత్తున ప్రచారం కావడం గమనార్హం. ఇకపోతే ఎట్టకేలకు ఈ విషయంపై పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

తన తల్లిదండ్రుల గురించి జరుగుతున్న ప్రచారం పై ఆకాష్ పూరీ స్పందించారు. ఆకాష్ పూరి అవన్నీ వాస్తవాలు కాదని కొట్టిపారేశారు. ఇకపోతే తాజాగా నటుడు ఆకాష్ పూరి త్వరలో చోర్ బజార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు . ఇక ఈ సినిమా జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శర వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఆకాష్ పూరీ తన తల్లిదండ్రుల పై వస్తున్న ప్రచారం గురించి స్పందించడం జరిగింది .

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఒక సమయంలో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆస్తులు పోయి.. ఇల్లు కార్లు కూడా పోయాయి అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ.. కష్టాల్లో కూడా అమ్మ ఇచ్చిన సపోర్ట్ తోనే నాన్న తిరిగి నిలదొక్కుకో గలిగారు. ఇక అమ్మ వాళ్ళది నిజమైన ప్రేమ. అమ్మ లేకుంటే నాన్న ఈ కాలంలో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ని ఇంతలా ప్రేమించింది అంటే అది కేవలం అమ్మ వల్లే సాధ్యమైంది అని ఆకాష్ పూరీ వెల్లడించారు.

ఇక మీ తల్లిదండ్రులిద్దరూ విడిపోతున్నరు అని వార్తలు వస్తున్నాయి . దీనిపై మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని విలేకరు ప్రశ్నించగా.. అలాంటి వార్తలు వచ్చినట్లు నాకు తెలియదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఏం చేయాలో తెలియక కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు అంటూ ఆకాష్ తెలిపారు.

Share post:

Popular