ముందే చనిపోతానని ఆ స్టార్‌ హీరోకి చెప్పిన సిల్క్ స్మిత.. చెప్పినట్టే..?

శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత తెలుగు వెండితెరపై ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. ఇక ఆమె అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే ఇక తన మాటలతో, చూపులతో కుర్రకారుకు మత్తెక్కించేది. ముఖ్యంగా చిన్న వయసులోనే స్టార్ హీరోలు, హీరోయిన్ లు సైతం ఆశ్చర్యపోయేలా అభిమానులను సొంతం చేసుకున్న ఈమె 36 సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడం సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి.

1996 సెప్టెంబర్ 23 ఉదయం ఏడు గంటలకే ఆమె మరణించిందనే వార్త సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేసింది. చెన్నై లో ఉన్న వలసరవాక్కం లో తన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాదాపుగా 13 సంవత్సరాల పాటు కోట్లాది మందిని తన నటనతో ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత ఏకంగా 450 సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 1975 – 90 మధ్యకాలంలో ఈమెకు ఎంత క్రేజ్ ఉండేది అంటే ఇక తన నటనకు హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు.

తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సినిమాను తమిళంలో 1983లో నీతిపతిగా రీమేక్ చేశారు. ఇక ఎన్టీఆర్ ద్వి పాత్ర స్థానంలో శివాజీగణేషన్.. ఆయన కుమారుడు ప్రభు చేశారు . ఇక హీరోయిన్ రాధిక. ఇక ఇంత పెద్ద కాంబినేషన్ రావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు కూడా భారీ పెరిగిపోయాయి. ఇక ప్రివ్యూ చూసిన వాళ్లంతా మొహం చిట్లూ కున్నారు.

అయితే జనం గురించి తెలిసిన బయ్యర్లు మాత్రం సినిమాకు ఇంకా ఏదో కావాలని పట్టుబట్టారు. చివరికి నిర్మాత సురేష్ బాలాజీకి సినిమా అమ్ముడుపోతే తప్ప వేరే గత్యంతరం లేదుఅనుకున్నారు. కానీ చివరికి సిల్క్ స్మిత డేట్ల కోసం ట్రై చేశారు . ఇక పదిహేను రోజుల తర్వాత అత్యంత కష్టం మీద ఆమె డేట్లు దొరికాయి . ఇక అది కూడా రాత్రిపూట మాత్రమే. ఈ లోగా బాలసుబ్రహ్మణ్యం – జానకి తో రెడీగా పాట షూట్ చేయించి పెట్టారు. చెన్నై బీచ్ లో వేసిన సెట్ లో షూట్ చేయడం జరిగింది. ఈ ఒక పాటకు నిజంగానే బయ్యర్లకు మత్తు ఎక్కింది. ఇక సినిమాను భారీ రేట్లకు కొనుగోలు చేశారు. సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ అయింది.

ఇకపోతే ఆమె చనిపోతే తెలుగు , తమిళ సినిమా పరిశ్రమలో నుంచి సాయంత్రానికి హీరో అర్జున్ మాత్రమే అందరికంటే ముందు అక్కడికి వచ్చారు. ఇక అర్జున్ రావడానికి కూడా ఒక విచిత్రమైన కారణం ఉంది. ఎందుకంటే కొద్దిరోజుల ముందే సునీత అర్జున్ తో ఓ సినిమా షూటింగ్ చివరి రోజున త్వరలోనే చనిపోతున్నాను చూడడానికి వస్తావా..? అని చెప్పిందట. కానీ అర్జున్ కోపగించుకొని అలా మాట్లాడొద్దు అంటూ చెప్పాడట. ఇక ఇంత ప్రమాదం జరుగుతుందని అతడు ఊహించలేకపోయాడు. ఇక అర్జున్ సిల్క్ స్మిత పార్థివ దేహాన్ని చూసి బోరున విలపించారు.