బిగ్ బాస్ 6 హోస్ట్ గా సమంత..బుర్ర వాడండయ్యా..నాగ్ షాక్ మామూలుగా లేదుగా..?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వార్త ఇదే. సమంత బిగ్ బాస్ సీజన్ 6 కు హోస్ట్ గా చేయబోతుందట. ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. స్టార్ సెలబ్రిటీలు సైతం నిజంగా సమంత హోస్ట్ చేయబోతుందా అని ఆమెకు మెసేజ్ లు చేసి మరి అడుగుతున్నారట. ఈ క్రమంలోనే ఆమె సన్నిహితులు కూడా ఆ విషయం పై క్లారిటీ ఇస్తూ…అలాంటిది ఏం లేదని అది ఫేక్ న్యూస్ అని చెప్పుతున్నారు. కానీ, ఆ న్యూస్ మాత్రం ఆగడం లేదు..సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

దీంతో ఇక రంగంలోకి దిగ్గారు సమంత ఫ్యాన్స్. ఆ దిక్కు మాలిన షో కి హోస్ట్ గా చేసే కర్మ ..సమంతకి పట్టలేదు..ఆమె ఇండియా లోనే టాప్ హీరోయిన్ అంటూ రీసెంట్ గా ఓ ప్రముఖ సంస్ధ కండెక్ట్ చేసిన పోల్ ను ప్రస్తావిస్తూ..సమంత ను ఓ రేంజ్ లో పొగిడేశారు. అంతేనా, గాసిప్ రాయుళ్ల పై కూడా సెటైర్స్ వేస్తూ..గాసిప్ క్రియేట్ చేసే వాళ్లకైన బుర్ర ఉండాలి..ఇలాంటి షోని సమంత లాంటి పెద్ద స్టార్ హీరోయిన్ ఎందుకు హోస్ట్ చేస్తుంది. ఆమె హాలీవుడ్ సినిమాలు ఓకే చేసే రేంజ్..లోకల్ కాదు..ఆ బ్యాచ్ వేరే ఉంటారు అంటూ పరోక్షంగా అక్కినేని నాగార్జున ను దెప్పిపోడుస్తున్నారు.

మనకు తెలిసిందే..సమంత అక్కినేని ఇంటి పేరు తోలగించినప్పటి నుండి ఆమె పై సోషల్ మీడియా లో కొందరు చాలా వల్గర్ గా మాట్లాడి…సమంతను, ఆమె ఫ్యాన్స్ ను బాధపెడుతున్నారు. ఈ మాటలతో విసిగిపోయిన సామ్..రీవర్స్ కౌంటర్లు స్టార్ట్ చేసింది. మొన్నటికి మొన్న ఓ నెటిజన్..నీ బ్రతుకు కుక్కలతో ఒంటరిగా చావడమే అంటూ దారుణమైన విధంగా అవమానించినా..సామ్ మాత్రం కూల్ గా..” అదే జరిగితే..నేను చాలా లక్కి అనుకుంటా”అంటూ తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చింది. ఇక ఇప్పుడు సమంత ఫ్యాన్స్ అక్కినేని అభిమానులను టార్గెట్ చేస్తూ..కామెంట్స్ చేయడం..కొంచెం షాకింగ్ గానే ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఈ పరోక్ష వార్ ఎప్పుడు ముగుస్తుందో..అస్సలు బిగ్ బాస్ 6 హీస్ట్ ఎవ్వరో..?

Share post:

Popular