నయనతార – విఘ్నేష్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకుంది నయనతార. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలను మాత్రమే చేసిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా నటనకే పరిమితమై లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ సూపర్ స్టార్ గా పేరు పొందిందని చెప్పవచ్చు.

అయితే నయనతార 20 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. అయితే నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం నడుస్తోందని ఈ మధ్య కాలంలో మాత్రమే వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ముఖ్య కారణం “నేను రౌడీ నే” అనే చిత్రమట. ఈ సినిమా సమయంలో వీరిద్దరి అభిప్రాయాలు ఒకరిపై ఒకరికి నచ్చడంతో ఒకరిపై ప్రేమ మరొకరికి కలిగిందట. ఇక ఈ చిత్రం ఈవెంట్ లో నయనతార,విఘ్నేష్ గంటల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు అని ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి.

ఇక 2017 వ సంవత్సరం లో ఒక అవార్డు ఫంక్షన్లో కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్త బాగా వినిపించింది. ఇక విఘ్నేష్ కూడా నయనతార హీరోయిన్ అని కాకుండా ఒక మంచి మనసున్న అమ్మాయి అని తెలియజేశారు. ఇక 2021 -మార్చి 25న వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఇక మరి కొద్ది రోజులలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అందుకు సంబంధించిన పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక వీరి వివాహ వేడుకను నెట్ ఫ్లెక్స్ లో చూడవచ్చు.

Share post:

Latest