హీరోయిన్ నదియాను ఆ హీరో ప్రేమించాడా.. ఇందులో నిజమెంత..?

సినిమా ఇండస్ట్రీలో ఏ జంట అయినా సరే హిట్ అయిన జంటలు చాలానే ఉన్నాయి. వరుస విజయాలు అందుకు ఉన్నాయంటే ఆ జంట హిట్ పెయిర్ గా ముద్ర పడి పోతూ ఉంటుంది.. ఇక అప్పట్లో అయితే ఎక్కువగా కృష్ణ-శ్రీదేవి, ఏఎన్నార్-సావిత్రి, ఎన్టీఆర్-శ్రీదేవి, బాలకృష్ణ విజయశాంతి, సౌందర్య- వెంకటేష్, చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్లు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఈ జంటకు మంచి హిట్ పెయిర్ అని పేరు లభించింది. ఇలాంటి జంటలు కలిసి నటిస్తే ఆ సినిమా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది..

అయితే ఇలాంటివి ఎక్కువగా స్టార్ హీరో హీరోయిన్ ల కాంబినేషన్ లో మాత్రమే ఉంటుంది అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అయితే మీడియం రేంజ్ హీరోలు హీరోయిన్లు కాంబినేషన్లో కూడా వరుసగా రిపీట్ అవుతూ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా హీరో, హీరోయిన్ పదేపదే కాంబినేషన్ లో సినిమా చేశారంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్లుగా వార్తలు ప్రచారం జరుగుతూ ఉంటాయి. అప్పట్లో ఇలాంటి సంఘటనే సీనియర్ నటుడు సురేష్, హీరోయిన్ నదియా మధ్య జరిగినట్లు సమాచారం.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు రావడంతో పాటు ఆ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక సురేష్ స్వతహాగా సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో హీరోగా అప్పట్లో బాగానే సక్సెస్ అయ్యారు. ఇక ఈయన తండ్రి ఒక రచయిత, దర్శకుడు కూడా. అయినప్పటికీ కూడా ఈయన మీడియం రేంజ్ హీరోగా మాత్రమే నిలిచిపోయాడు. కెరియర్ మొదట్లో హీరో సురేష్ , నదియా కలిసి ఒక తమిళ చిత్రంలో నటించారు . ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత దర్శకనిర్మాతలు వీరి కాంబినేషన్లో పలు చిత్రాలను చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు బయటికి వచ్చాయి. ఇక వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని తమిళ మీడియాలో బాగా వార్తలు వినిపించాయట. ఇక వీరిద్దరూ అప్పుడే కెరియర్ పరంగా పెరుగుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడంతో ఈ వార్తలను సురేష్ ఖండించాల్సి వచ్చిందట.

ఆ తరువాత ఏ చిత్రంలో కూడా నదియాతో నటించలేదు సురేష్.. ఇక నదియా కూడా అవకాశాలు తగ్గడంతో ఒక ఎం.నారాయణను వివాహం చేసుకుని సెటిల్ అయింది సురేష్ కూడా అనిత రెడ్డి అనే హీరోయిన్ ను వివాహం చేసుకున్నారు.

Share post:

Popular