నాని నోటి దుడుకు..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి. హీరో లు జీరోలు అవుతున్నారు..యంగ్ హీరోలు స్టార్స్ అవుతున్నారు. పెద్దింటి హీరోల సినిమాలు అయినా కధ బాగోలేకపోతే..అభిమానులు యాక్సెప్ట్ చేయడం లేదు. బడా బడా హీరోల సినిమాలే బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి . అయితే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో నాని పరిస్ధితి అర్ధం కాకుండా తయారైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే..ఈ మధ్య కాలంలో నాని చేసిన అన్ని మూవీ లు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టేశాయి.

- Advertisement -

టక్ జగదీష్, వి..సినిమాలు అయితే దారుణమైన టాక్ ను సంపాదించుకున్నాయి. మధ్యలో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న..రీసెంట్ గా రిలీజ్ అయిన “అంటే సుందరానికి” సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రమోషన్స్ టైంలో సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు కానీ.. సినిమా రిలీజ్ అయ్యాక టోటల్ రివర్స్ అయ్యింది. సినిమా దొబ్బేసింది. అయితే, ఇప్పుడు నాని ఆశలని దసరా సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. మాస్ ఇమేజ్ తో రాబోతున్న ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోతే..నాని సినీ కెరీర్ బిగ్గెస్ట్ రిస్క్ లో పడిన్నట్లే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా, ఇలా నాని సినీ కెరీర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆయన నోటి దూకుడే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో నాని ఓ సినిమా విషయంలో బడా ప్రముఖులతోనే వైరం పెట్టుకున్నాడని.. పైగా రీసెంట్ గా టికెట్స్ ఇష్యూ టైంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి..మరిన్ని సమస్యలు కొన్ని తెచ్చుకున్నాడని ..అందుకే ఆయన సినిమాలు ఇలా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా నానికి ఫస్ట్ నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు.. అందుకే కాబోలు ఆయన ఇలాంటి పరిస్ధితులు ఎదురుకుంటున్నాడు..అంటూ నాని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా నాని కెరీర్ కష్టాల్లో ఉంది అన్నది మాత్రం నమ్మాల్సిన వాస్తవం..!

Share post:

Popular