జ‌గ‌న్ స‌ర్కారుపై ఎందుకింత దొంగాట‌.. విప‌క్షాల వ్యూహం ఏంటి?

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై ఏం జ‌రుగుతోంది? అంటే.. గ‌త ఆరుమాసాలుగా చూసుకుంటే.. ఆయ‌న ప్ర‌భు త్వం అప్పులు చేసేస్తోంద‌ని.. లెక్క‌కు మించి అప్పులు చేస్తున్న‌కార‌ణంగా.. రాష్ట్రం భ‌విష్య‌త్తులో ఇబ్బం ది ప‌డిపోతుంద‌ని. పెద్ద ఎత్తున ఒక వైపు ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు.. సంక్షేమ ప‌థ‌కాల‌కు అప్పులు చేసిన సొమ్మును పంచుతున్నార‌ని.. యాగీ చేస్తున్నారు. అంతేకాదు… ప‌ప్పుబెల్లాల్లా.. ఈ ప‌థ‌కాల కింద అన‌ర్హుల‌కు కూడా నిధులు పంచేస్తున్నార‌ని.. వీరంతా కూడా వైసీపీ సానుభూతి ప‌రులేన‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది.

పోనీ.. ఇలా అంటున్నారు కదా… అని.. అన‌ర్హుల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తే.. అదిగో.. డ‌బ్బులు లేక‌.. సంక్షేమ ప‌థ‌కాల్లో ల‌బ్ధి దారుల‌ను కోసేస్తున్నార‌ని.. మ‌రో యాగీ చేస్తున్నారు. ఇక‌, కేంద్రం పెద్ద ఎత్తున జ‌గ‌న్ స‌ర్కారుపై క‌న్నెర్ర చేసింద‌ని.. ఇక‌, అప్పులు పుట్టే ప‌రిస్థితి లేద‌ని.. ప్ర‌చారం చేసేది కూడా ప్ర‌తి ప‌క్షాలు. పోనీ.. ఇంత‌లో.. రాష్ట్రం అభ్య‌ర్థ‌న ఆల‌కించి.. కేంద్రం ఏదైనా.. అప్పుల‌కు..త‌లాడిస్తే.. టాఠ్‌! రాష్ట్రానికి కేంద్రం గుడ్డిగా వంత పాడుతోంది! అంటూ.. దుమ్మెత్తి పోసేది కూడా ఈ ప్ర‌తిప‌క్ష‌మే.

ఇలా మొత్తానికి చూసుకుంటే.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఒక నియ‌మిత‌.. విధానం.. నిర్మాణాత్మ‌క విధానంలో విమ ర్శలు చేయ‌డం మానేసి.. ఎక్క‌డిక‌క్క‌డ ఏది దొరికితే ఆ అంశంపై విమర్శ‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల్లో ఒక విధ మైన క‌ల‌వ‌రం.. క‌ల్లోలం పుట్టించేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటివి ఇటీవ‌ల కాలంలో మ‌రింత ఎక్కు వైంది. అంటే.. ఒక ర‌కంగా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకు సాగ‌కూడ‌దు.. అనేధోర‌ణి.. అప్పులు పుట్ట‌కూ డ‌దు.. అనే ఆలోచ‌న ప్ర‌తిప‌క్షాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇటీవ‌ల ఏకంగా.. కేంద్రం నుంచి వ‌చ్చిన 28 వేల కోట్ల రుణంపై కూడా హైకోర్టులో వైసీపీకే చెందిన రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పిటిష‌న్ వేశారు. దీనిలో ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇస్తున్న‌రుణాల‌పై ప్ర‌శ్నించారు. రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని.. దీనిని అనుమ‌తించ వ‌ద్ద‌ని అప్పులు ఇవ్వ‌కుండా.. కేంద్రాన్ని నిలువ‌రించాల‌ని.. ఆయన పేర్కొన్నారు. అయితే.. దీనిని కోర్టు తోసిపుచ్చింది.

అప్పులు తెచ్చుకోవాలా.. వ‌ద్దా.. అనేది రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని.. ఇవ్వాలా.. వ‌ద్దా.. అనేది కేంద్రం నిర్ణ‌య‌మ‌ని.. తాము ఎందుకు జోక్యం చేసుకుంటామ‌ని.. ప్ర‌శ్నించింది. కానీ.. ఈ ప‌రిణామాల‌పై వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌కు విచార‌ణను వాయిదా వేసింది. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారు…పై వ్యూహాత్మ‌క దాడులు పెరుగుతున్నాయ‌ని చెప్ప‌డానికి ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest