రాజమౌళి వల్లనే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యిందా ? వామ్మో ఇదెక్కడి మ్యాటర్..

ఎన్నో అంచనాల మధ్య ఆచార్య సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తన ఒక్కగానొక్క కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఫుల్ లెంగ్త్ పాత్రతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే కానీ మెగాస్టార్ రామ్ చరణ్ మూవీలో ఇంతకు ముందు అలా అలా మెరిసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఇద్దరూ కీలక పాత్రలలో కనిపించడంతో అభిమానులు ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కోనసాగుతున్న కొరటాల శివ మూవీ కావడంతో ఖచితముగా హిట్ అవుతుంది అని అంతా భావించారు. కానీ అంచనాలు అన్నీ తలక్రిందులు అయిపోయాయి. మొదటి షో నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ దిశాగా దూసుకు వెళుతోంది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ వాస్తవానికి ఒక బలమైన మరియు ఆధారం కలిగి ఉన్న కారణం మాత్రం ఇప్పుడు మెగా అభిమానులను ఎంతగానో వేధిస్తోంది. అయితే అదేమియత్ ఒకసారి చూద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్నది ఎస్ ఎస్ రాజమౌళి. ఇతను సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే చరిత్ర కలిగిన సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని 1500 కోట్ల కలెక్షన్ ల దిశగా దూసుకువెళుతోంది. ఇందులో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరూ పోటా పోటీగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర కన్నా రామ్ చరణ్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన ప్రకారం.. రాజమౌళి తో చేసిన హీరో చేసే తర్వాత సినిమా ఏదైనా ఖచ్చితంగా ప్లాప్ అవుతూ వచ్చింది. అయితే ఆచార్య సినిమా రిలీజ్ కు ముందు కూడా దీనికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఏ వార్తలను అటు చిత్ర బృందం కానీ మెగా అభిమానులు కానీ పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు అదే నిజమైంది. ఇంతకు ముందు కూడా ప్రభాస్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాహూ మరియు రాధే శ్యామ్ లాంటి ప్లాప్ సినిమాలను అందించాడు. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఆచార్య ప్లాప్ అయింది. దీనితో మరోసారి రాజామౌళి వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే జాతకాలు, గ్రహఫలాలు ఇవన్నీ పక్కన పెడితే… సినిమాలో విషయం లేదు అంటున్నారు ప్రేక్షకులు. కొరటాల శివ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అని ఊహించి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు నెత్తిన గుడ్డ వేసుకుని పడుకునేలా ఉందట సినిమా. సినిమాకు ఆయువు అయిన క్లైమాక్స్, సెంటిమెంట్, పాటలు, కథ, కథనం ఇలా అన్ని విషయాలలో కొరటాల తప్పటడుగు వేసి కెరీర్ లో తొలి అపజయాన్ని సొంతం చేసుకున్నాడు.