డైరెక్టర్ ఎందుకు అలా చేశాడో తెలియదుకాని తప్పు చేశావ్..మహేశా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే చాలా సాఫ్ట్ అంటుంటారు అందరు. చాలా డీసెంట్ మనిషి అని.. ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయని అంటుంటారు. కానీ, రీసెంట్ గా ఆయన నటించిన సర్కారు వారు పాట సినిమా ట్రైలర్ చూశాక ..ఎందుకో జనాలను కొన్ని మాటలు హర్ట్ చేశాయట. మనకు తెలిసిందే..డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో మహేష్ బాబు హీరో నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నారు.

మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే..అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీం సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ చేసింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అభిమానులని అమితంగా ఆకట్టుకుంది. అంతేనా..ట్రైలర్ పిచ్చ కామెడీ గా ఉంది. సినిమా కోసం ధియేటర్ కి వెళ్లిన జనాలు కడుపుబ్బ నవ్వుకోవడం పక్క అంటూ..అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా మహేష్-వెన్నెల కిషోర్-మహేశ్ ల మధ్య వచ్చే కామెడీ టైమింగ్ కేక పెట్టిస్తున్నాయి.

సరే, అంతా బాగానే ఉంది గా..హమ్మాయ్య అనుకునే లోపే ..మహేశ్ నోటి నుండి రెండు వల్గర్ పదాలు వినపడ్డాయి. ఒక సీన్లో మ‌హేష్ విలన్ ని ఉద్దేశిస్తూ..ఎందుకంటే ఆడిది మ‌రి పెద్ద‌.. అంటూ చెయ్యి చూపిస్తాడు. అక్కడ ఆ పదం వాడక పోయినా.. మ‌హేష్ చెప్పిన డైలాగ్ ఏంటో అందరికి తెలిసిందే. అది చాలా వ‌ల్గ‌ర్‌గా అనిపిస్తోందట. అలాగే .. ట్రైల‌ర్ చివ‌ర్లో మహేశ్ బాబు” ఓ వంద వ‌యాగ్రాలు వేసి శోభ‌నం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లికొడుకు గ‌ది కి వచ్చిన‌ట్లొచ్చారు అంటూ మ‌హేష్ ప‌లికిన మరో డైలాగ్ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించిందట. నిజానికి మహేశ్ సినిమా అంటే బీప్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూడచ్చు అనుకునేలా ఉంటాయి. మరి డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు. చూడాలి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఎలా ఉంటుందో..?

Share post:

Latest