ఫ్యాన్స్ కు నిరాశే ..విజయ్ దేవరకొండ బ్యాక్ స్టెప్.. భయపడ్డడా..?

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే భీబత్సమైన క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా లో సైలెంట్ బాయ్ అనిపించినా..ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమా తో ఇండస్ట్రీ లెక్కలనే మార్చేశాడు. ఒక్క సినిమా తో తన తలరాతను మార్చేసుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటే అభిమానులకు పిచ్చి..ఆయన స్టైల్ అంటే పిచ్చెక్కిపోద్ది యువతకి.

అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఆయన బోలెడు సినిమాల్లో నటించినా ఇంకా కూడా విజయ్ ని అర్జున్ రెడ్డి గానే గుర్తిస్తున్నారు అంటే అందులో ఆయన పాత్ర..ఆ బాడీ లాంగ్వేజ్..అభిమానులను ఎంత గా ఆకట్టుకుందో మనం అర్ధం చేసుకోవచ్చు. విజయ్ హీరోగా పూరీ జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన “లైగర్” రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత వెంటనే ఆయన డైరెక్షన్ లోనే “జనగణమన”అనే సినిమాకు కమిట్ అయ్యాడు.

ఇక ఆ తరువాత మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ లో ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఖుషీ అంటూ టైటిల్ రివీల్ చేసిన మేకర్స్..ఈ సినిమాను తెలుగు, తమిళం,లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా సినిమా అని హిందీలో రిలీజ్ చేయకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ సినిమా లో విజయ్ కాశ్మీరీ ముస్తీ యువకుడిగా నటిస్తున్నాడు . సమంత కూడా కాశ్మీరి పండిట్ ల అమ్మాయిగా నటిస్తుంది. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమ కథలో చాలా సున్నితమైన ఎమిమెంట్స్ ఉన్నాయట. పైగా కాశ్మీర్ ప్రస్తుత సిట్యూవేషన్ తెలిసిందే. సినిమా ఎక్కడ తేడా కొట్టిన దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ అయిపోతుంది. పైగా శివ నిర్వాణ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా..మరో పక్క లైగర్ పై బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు పూరి, ఛార్మీ,విజయ్..ఇక ఇలాంటి టైంలో రిస్క్ లు వద్దు అని..బ్యాక్ స్టెప్ వేసి..హీందీలో సినిమా రిలీజ్ వద్దు అనుకున్నారట.

Share post:

Latest