మంత్రి ర‌జ‌నీని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌..!

రాజకీయాలు అంటేనే సెంటిమెంటు క‌ల‌బోత‌. ఇటు ప్ర‌జ‌ల్లో ఉన్నా.. అటు వ్య‌క్తిగ‌తంగా అయినా.. నాయ‌కు ల‌కు సెంటిమెంటు అవ‌స‌రం. ఇక‌, పార్టీలు కూడా సెంటిమెంటుచుట్టూనే రాజ‌కీయాలు చేస్తున్నాయి. సెంటిమెంటు లేని రాజ‌కీయాలు.. సిరాలేని పెన్నుతో స‌మానం అంటాడు.. కాళోజీ నారాయ‌ణ‌రావు. సో.. సెంటిమెంటుకు.. రాజ‌కీయాల‌కు మ‌ధ్య సయామీ క‌వ‌ల‌ల‌కున్నంత బంధం ఉంటుంది. అయితే.. ఈ సెంటిమెంటు.. పాజిటివ్‌గానూ ప‌నిచేస్తుంది.. నెగిటివ్‌గానూ.. ప‌నిచేస్తుంది.

పాజిటివ్‌గా ఉంటే.. ఒక‌ర‌కంగా.. పార్టీలు పుంజుకుంటాయి. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మ‌రీ.. స‌ద‌రు పాజిటివ్ సెంటిమెం టును రాజేస్తాయి. అయితే.. నెగిటివ్ సింటిమెంటు కొన్ని కొన్ని సార్లు నాయ‌కుల‌ను ప‌ట్టిపీడిస్తోంది. ఇలా.. నెగిటివ్ సెంటిమెంటుతో చాలా మంది నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. `ఆయ‌న గెలిచాడా.. ఆయ‌న పార్టీ అధికారంలోకిరాదు` అని ఒక నాయ‌కుడి గురించి రాయ‌ల‌సీమ ప్రాంతంలో ప్ర‌చారం ఉంది. అదేవిధంగా చాలా మంది నాయ‌కుల‌కు `ఐర‌న్ లెగ్‌` అనే సెంటిమెంటు కూడా ఉంది.

ఇక‌, ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ సెంటిమెంటే.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాప్ర‌స్తుత ప‌ల్నాడు జిల్లాలోని చిలక లూరి పేట ఎమ్మెల్యే క‌మ్ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ విష‌యంలో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఆమె దూకుడుగా ఇక్క‌డ తిరిగారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. సెంటిమెంటు సెంటిమెంటే అంటున్నారు ప‌రిశీల‌కులు. అదెలాగంటే.. ఇక్క‌డ నుంచి గ‌తంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌.. మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు.. మంత్రి అయ్యాక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

అంటే.. చిల‌క‌లూరి పేట నుంచి మంత్రి అయిన‌.. త‌ర్వాత‌.. ఆయ‌న ఓడిపోవ‌డాన్ని సెంటిమెంటుగా ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు పుల్లారావు త‌ర్వాత‌.. వైసీపీ గ‌వ‌ర్న‌మెంట్‌లో విడ ద‌ల ర‌జ‌నీ.. మంత్రి అయ్యారు. మ‌రి ఆ సెంటిమెంటుతో ఆమె కూడా ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతా రా? అనే విష‌యం ఏ న‌లుగురు గుమిగూడినా జ‌రుగుతోంది. మంత్రి చుట్టూ సెంటిమెంటు గూళ్లు అల్లుకు న్నాయి. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. గ‌త మూడేళ్ల‌లో చెప్పుకోద‌గ్గ విష‌యాలు లేవు.

గ‌తంలో మాజీ మంత్రి పుల్లారావు ఉన్న‌ప్పుడు వేసిన రోడ్లు.. చేసిన ప‌నులే ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. వైసీపీ హ‌యాంలో ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ.. చేయాల‌ని అనుకున్నా.. మ‌ధ్య‌లో రెండేళ్లు క‌రోనా వ‌చ్చింది. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌చ్చింది . ఈ ప‌రిణామాల‌తో ఇక్క‌డ అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీ.. చుట్టూ అభివృద్ధి+ సెంటిమెంటు కేంద్రంగా.. రాజ‌కీయ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share post:

Latest