‘షణ్ముఖ్ – దీప్తి సునైనా’ మళ్లీ ఒక్కటయ్యారు..

గత కొంత కాలంగా మనుషుల జీవితాలు సోషల్ మీడియా వలన ఎంతగా ప్రభావితం అవుతుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవ్వరి చేతిలో చూసినా ఒక స్మార్ట్ ఫోన్ అందులో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ ఇలా నాలుగు యాప్ లు ఉంటాయి.. ఇక వేరే పని లేదన్నట్లు నిత్యం అందులోనే ఎంతో కాలక్షేపం చేస్తుంటారు. దీని వలన ఎందరో తమ సొంత టాలెంట్ ను ఇందులో చూపిస్తూ ఫేమస్ అవుతున్నారు. అలా ఒక స్థాయికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇదే సోషల్ మీడియా వలన సినిమా రంగంలోకి ఆడుగు పెట్టినవారు కూడా ఉన్నారు. కొందరు ఏమి వెబ్ సీరిస్ లలో బిజీగా ఉంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాటిలో షణ్ముక్ జస్వంత్ ఒకరు. తన షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సీరిస్ లతో షణ్ముక్ జస్వంత్ ఒక నటుడిగా స్థిరపడ్డాడు. అయితే అప్పటికే ఇదే ఫీల్డ్ లో ఉన్న మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయనతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా మెల్లగా ప్రేమగా మారి ఇద్దరూ తమ లోకంలో విహరించారు. వీరిద్దరూ కలిసి కొన్ని సాంగ్స్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో షణ్ముక్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంటర్ అయ్యాడు. అయితే ఈ బిగ్ బాస్ కారణంగా వీరిద్దరి మధ్యన కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ను ఎప్పటి లాగే మీడియా ఇంకొంచెం దూరం చేసి చివరకు విడిపోయేలా చేసింది. అయితే ఇందుకు ప్రధాన కారణం మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న మరో కంటెస్టెంట్ సిరి హన్మంతు వల్లనే అని తెలిసిందే. వీరిద్దరూ హౌజ్ లో ఉన్న తీరు అందరినీ ఎంతగానో బాధించింది. రియల్ లవర్స్ లాగా సాగించారు కథని… ఇక బయటకు రావడంతో వివాదం కాస్త పెద్దదిగా మారి బ్రేక్ అప్ తో సైలెంట్ అయిపోయారు.

ఇది జరిగిన కొద్ది రోజులకు మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించారు. అయితే వీళ్ళు కలిసింది వీరి కోసం కాదట. వేరే వ్యక్తి కోసం ఇద్దరూ కలిసి రిక్వెస్ట్ చేయడానికి వచ్చారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలం సాగించిన వీరి ప్రేమకు గుర్తుగా వీరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే.. వీరు ఒకరిగా కంటే కూడా…ఇద్దరిగా ఎక్కువ మంది అభిమానాన్ని పొందగలిగారు. ఇద్దరూ చేసిన ఎన్నో వీడియోల వల్ల బాగా ఫేమస్ అయ్యారు. ఇరువురికి ఎటువంటి కష్టం వచ్చినా పక్కనే ఉంటూ దైర్యం చెప్పుకుంటూ, ఇన్నాళ్లు తమ జీవితాన్ని సాగించారు. ఎంతలా అంటే… ఒకరి కోసం మరొకరు ఏదైనా చేసేంతలా వీరి ప్రేమ పెరిగి పెద్దది అయింది. దీప్తి సునైనా కూడా జస్వంత్ తో జీవితాన్ని పంచుకోవడానికి సుముఖంగానే ఉంది. అదే విధంగా జస్వంత్ సైతం సోషల్ మీడియా వేదికగా పలు మార్లు తనపై ఎంత ప్రేమ ఉంది అనేది తెలిపాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరు పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. ఇక ఫ్యాన్స్ అయితే తొందరగా పెళ్లి చేసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం స్టార్ట్ చేశారు.

సరిగ్గా అదే సమయానికి బిగ్ బాస్ వీరిని విడగొట్టింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో సిరి జస్వంత్ లు చేసిన పనులు అన్నీ అందరికీ తెలిసినవే.. ఆఖరికి షణ్ముఖ్ తల్లి మరియు సిరి తల్లి ఇద్దరినీ అసహ్యించుకున్నారు. వీరు తమ చుట్టూ ఏమి జరుగుతోంది అని కూడా తెలుసుకోకుండా ముద్దులు, హగ్గులతో మునిగిపోయారు. అయితే దీప్తి తో లవ్ లో ఉండి కూడా ఎందుకు అతను అలా చేశాడు అని అంతా ట్రోల్ చేశారు. ఎందరో సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ కు చెప్పే ప్రయత్నం చేసినా అతను మారలేదు. ఇక ఇది భరించలేక దీప్తి సునైనా అతన్ని దూరంగా పెట్టింది. ఇక జస్వంత్ సైతం బ్రేక్ అప్ కి ఓకె చెప్పి శుభం కార్డ్ వేశాడు.

లేటెస్ట్ గా విడిపోయిన వారు మళ్లీ ఒకటి అయ్యారు అని తెలుస్తోంది. కానీ వీళ్ళు కలిసింది మాత్రం బిగ్ బాస్ ఓ టి టి కోసమని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో టైటిల్ కోసం అఖిల్ మరియు బిందు మాదవి లు బరిలో ఉన్నారు. దానితో అఖిల్ కు సపోర్ట్ గా జస్వంత్ మరియు సునైనా లు వచ్చారట. వీరిద్దరూ వారిని గెలిపించడం కోసం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారట. ఈ పోస్ట్ ను చూసిన జనం అంతా ఏంటి మళ్లీ వీరిద్దరూ ఒక్కటి అయ్యారా అంటూ షాక్ అవుతున్నారు. కానీ ఇదంతా బిగ్ బాస్ కోసమని తెలిసి నాలుక కరుచుకున్నారు. అయితే వీళ్ళు మళ్లీ కలిసి సంతోషంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Share post:

Popular