బెడ్‌సీన్ గురించి ప్ర‌శ్న‌… దిమ్మ‌తిరిగే ల బోల్డ్ ఆన్స‌ర్ ఇచ్చిన టాప్ హీరోయిన్‌…!

ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు బెడ్ సీన్లపై నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాత్ర ద్వారా తమకు పాపులారిటీ వస్తుంది అంటే కచ్చితంగా వారు ఎంతటి బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే రొమాంటిక్ సన్నివేశాలలో పాల్గొంటూ నెటిజన్ల చేతుల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెలబ్రిటీలకు , అభిమానులకు మధ్య వ్యత్యాసం కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు.

ఇక తమ అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన ఎన్నో విషయాలను , ఫోటోలను, వీడియోలను కూడా వారితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా అభిమానులు అడిగే ప్రశ్నలకు అంతే ఓపికగా సమాధానం చెబుతూ వస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ దీనిని ఆసరాగా తీసుకొని సెలబ్రిటీలకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వారిని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ మాళవిక విషయంలో కూడా ఇలా జరిగిందని చెప్పవచ్చు. ఈమె కూడా ఇటీవల తన అభిమానులతో తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే సేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోని అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. ఇక అప్పుడు ఒక నెటిజన్ మారన్ సినిమాలో బెడ్ సన్నివేశాన్ని ఎన్నిసార్లు షూట్ చేశారు అని అడగ్గా.. ఆ విషయం పై స్పందించిన ఆమె నీ తలలో ఏదో పాడైనట్టు ఉంది అంటూ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇకపోతే మాళవిక తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పెట్టా.. విజయ్ తో మాస్టర్ లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఇక ధనుష్ తో కలిసి నటించిన మారన్ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో విడుదలైంది.

Share post:

Popular