HBD NTR: రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని తారక రాముడే..!!

మే 20..ఈ రోజు నందమూరి అభిమానులకు పండగ లాంటి రోజు అనే చెప్పలి. ఎందుకంటే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన అభిమానులంతా ఈ రోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ఇంట్లో వాళ్ళ బర్త డే లా గా ఫీల్ అయ్యి..సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక తారక్ పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుండే మొదలైయాయి. రాత్రి 12 గంటలకు అభిమానులంతా కలిసి అరుపులతో కేకలతో జై ఎన్టీఆర్..జై జై ఎన్టీఆర్ అంటూ కేక్ కట్ చేసి..తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక బిగ్ బిగ్ స్టార్స్ కూడా తారక్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతూ..తారక్ పై వాళ్లకు ఉన్న ప్రేమని..వాళ్ల తో ఉండే బాండింగ్ ను తెలియజేస్తున్నారు . ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, శ్రీను వైట్ల, మెహర్ రమేష్..ఇంకా పలువు ప్రముఖులు తారక్ కు మనస్పూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తెలియజేసారు.

అయితే, అందరికన్నా.. పోట్లూరి వీర ప్రసాద్ ..విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పెట్టిన ట్వీట్ అభిమానులను ఆకర్షిస్తుంది. గతంలో ఆయన తారక్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ..తన దైన స్టైల్ లో రాసుకొచ్చాడు. ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో..”రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని నా తారక రాముడే!! తన ఆహార్యం, వాచకం, అభినయం, నటన కౌసల్యంతో ప్రపంచ వేదికపై ఓక వెలుగు వెలగలని, మా కోట్లమంది అభిమానుల కోరిక”.. అని పీవీపీ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular