టాలీవుడ్‌లో ఈ వారం 4 సినిమాల పోటీ… గెలుపు ఎవ‌రిదంటే…!

టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలులేవు. అయితే రిలీజ్‌కు వ‌స్తోన్న 4 సినిమాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందుకు కార‌ణం ఈ సినిమాల కోసం మేక‌ర్స్ చేస్తోన్న ప్ర‌చారామే. ఈ నాలుగు చిన్న సినిమాలు కూడా డిఫ‌రెంట్ లైన్స్‌తో తెర‌కెక్కిన‌వే. ఓవ‌రాల్‌గా ఈ 4 సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేయ‌డంలో అయితే స‌క్సెస్ అయ్యాయ‌నే చెప్పాలి.

విశ్వ‌క్‌సేన్ న‌టించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ ప్లాన్ చేశాడు హీరో. అది కాంట్ర‌వ‌ర్సీ అవ్వ‌డంతో పాటు సినిమాకు రిలీజ్‌కు ముందే కావాల్సినంత హైప్ వ‌చ్చింది. అయితే విశ్వ‌క్ ఎంత ఇబ్బంది ప‌డ్డా సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్‌తో జ‌నాల్లోకి అయితే వెళ్లిపోయింది. ఈ సినిమా ట్రైల‌ర్ కూడా బాగుంది. దీంతో ఓపెనింగ్స్‌కు డోకా లేన‌ట్టే.

ఇక సుమ చాలా రోజుల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తూ జ‌య‌మ్మ పంచాయితీ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబుతో మొద‌లు పెడితే బుల్లితెర‌పై ప్ర‌తి ప్రోగ్రామ్‌ను ఈ సినిమా ప్ర‌చారానికి బాగా వాడుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆస‌క్తితో ఉన్నారు. ఇక కాంట్ర‌వ‌ర్సీ ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ తాను ఎంత చెత్త సినిమా చేసినా ఎలా జ‌నాల్లోకి తీసుకుపోవాలో బాగా తెలిసిన వాడు.

అందుకే త‌న తాజా సినిమా మా ఇష్టం (డేంజరస్) అనే సినిమా కోసం కూడా వర్మ తనదైన శైలిలో ప్రచారం చేస్తూనే ఉన్నాడు. హీరోయిన్లతో ముద్దులు పెట్టించుకుంటూ, బోల్డ్ ఇంటర్వ్యూలు, చ‌ర్చ‌ల‌తో గ‌త్త‌ర్ లేపేస్తున్నాడు. పై మూడు సినిమాల‌కు మాంచి ఎట్రాక్ష‌న్ ఉంది. అయితే నాలుగో సినిమా భళా తందనాన మాత్రమే ఈ నాలుగు సినిమాల‌తో పోలిస్తే కాస్త వీక్‌.

అయితే శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా ప్రచారం బాగానే చేశారు. రాజ‌మౌళి లాంటి స్టార్ హీరో వ‌చ్చినా ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ పూర్తిగా రాలేదు. మ‌రి మంచి అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఈ నాలుగు సినిమాల్లో రిలీజ్కు ముందు విశ్వ‌క్ సినిమాయే కాస్త పై చేయిలో క‌న‌ప‌డుతోంది.

Share post:

Latest