“స‌ర్కారు వారి పాట” సెట్ లో దొంగతనం..సంచలన విషయం బయటపెట్టిన డైరెక్టర్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మహానటి కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు గా నతిస్తున్న చిత్రం..”సర్కారు వారి పాట”. ఓ ఢిఫరెంట్ స్టోరీతో..ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసారు చిత్ర బృందం. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఫుల్ క్లాస్ బీట్స్..మాస్ డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేశాడు మహేశ్.

డైనమిక్ డైరెక్టర్ ప‌రశురాం విజయ్ దేవరకొండ తో గీత‌గోవిందం లాంటి బిగ్ స‌క్సెస్ తరువాత చాలా ఏల్ళు గ్యాప్ తీసుకుని.. అనంత‌రం తెరకెక్కించిన సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలను పెట్టూకుని ఉన్నారు జనాలు. పైగా హీరో మహేష్ బాబు..ఆయన కు తగ్గట్లే హీరోయిన్ హా మహానటి కీర్తి సురేష్ ని తీసుకున్నారు.. ఇక సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..దుమ్ము లేసిపోవాలి అంతే.

కాగా, చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రశూరాం, కీర్తి ఓ ఇంటర్వ్యుల్లో పాల్గోన్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ..సర్కారు వారి పాట సెట్ లో దొంగతనం జరిగిందని చెప్పారు. “షూటింగ్ టైంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోని విష‌యం ఒకటి ఉంది. మేము ఈ సినిమా లో పాటల చిత్రీకరణ కోసం..స్పెయిన్‌లోని బార్సిలోనాలో షూట్ చేస్తున్నాం. అక్కడ లోకేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ అక్క‌డ దొంగ‌లు ఎక్కువ‌ అని విన్నాం. అప్ప‌టి మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. కానీ మా కళ్లు కప్పి..దొంగతనం చేసేశాడు. షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ సూట్ కేస్ లో పెట్టి ఒక వ్యానులో ఉంచాం. కానీ దొంగలు వచ్చి కీర్తిసురేశ్ కాస్టూమ్స్ ఎత్తుకెళ్లారు. మొత్తం నాలుగు సూట్‌కేసుల్లో కాస్ట్యూమ్‌స్ ఉన్నాయి. వాటిల్లో మూడు ఎత్తుకెళ్లారు. ల‌క్కీగా మేము ముందు రోజే మ‌రో రెండు రోజుల‌కు స‌రిప‌డా కాస్టూమ్స్ రెడీ గా పెట్టుకున్నాం కానీ, లేకపోతే షూటింగ్ కు చాలా ఇబ్బంది అయ్యేది”అంటూ చెప్పుకొచ్చారు పరశూరాం.

Share post:

Popular