బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: మెగా బ్రదర్స్ మల్టీస్టారర్..బాక్స్ బద్దలవ్వాల్సిందే..?

మెగా బ్రదర్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది చిరంజీవి-నాగబాబు-పవన్ కల్యాణ్..అలాంటి స్దానాన్ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మనం ఇక్కడ చూడబోయ్యేది టాలీవుడ్ బ్రదర్స్ కాదు..కోలీవుడ్ సూపర్ కూల్ బ్రదర్స్. మాస్ ఆడియన్స్ ను అన్న మెప్పిస్తే..క్లాస్ ఆడియన్స్ ను తమ్ముడు మెప్పిస్తాడు.. ఇప్పటికే మీకు అర్ధమైపోయింది కదా..వాళ్లు ఎవరో.. యస్..వాళ్లే కోలీవుడ్ టూ సూపర్ కూల్ మెగా బ్రదర్స్..”సూర్య-కార్తి”. వీళ్లకి తమిలంలో ఎంత క్రేజ్ ఉందో..తెలుగులోను అంతే అభిమానం అందుకుంటున్నారు అభిమానుల దగ్గర నుండి.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సూర్య-కార్తి లు..అంటే స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇష్టం. ఇక వీళ్లిద్దరిని కలిపి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలని ఎప్పటి నుండి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, పక్క ప్లాన్ తో ఎవరో ముందు అడుగు వేయట్లేదు. కానీ, ఇప్పుడు ఆ టైం వచ్చేసిం. ఇద్దరు బిగ్ బ్రదర్స్ ని కలిపి తెర పై చుస్తే ఎలా ఉంటుంది. అన్న మాస్ కి..తమ్ముడు క్లాస్ కి ..ధియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తే..దద్దరిల్లిపోవాల్సిందే. అట్లుంటాది సూర్య-కార్తి ఫ్యాన్స్ హవా.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..వీళ్లిద్దరు కలిసి కార్తి హీరో గా నటించిన “ఖైదీ” మూవీకి సీక్వెల్ తీయ్యబోతున్నారట. ఈ ‘ఖైదీ’ సినిమాలో కార్తీ రఫ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా సీక్వెల్ లో సూర్య కూడా యాద్ చేస్తే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని..అభిమానుల కోరిక నెరవేరుతుందని.. ‘ఖైదీ’ చిత్ర డైరెక్టర్ కనగరాజ్ ఆలోచిస్తున్నారట. ఇక సీక్వెల్‌లో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకి కూడా ఎస్.ఆర్. ప్రభు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. మరి చూడాలి ఈ సినిమా అభిమానులని ఎలా మెప్పిస్తుందో..?

Share post:

Popular