సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆ పేరుతో ఫ్రెండ్స్ ఆట ప‌ట్టించ‌డానికి కార‌ణం ఇదే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న ఏకైక సినీ నటుడు.. రాజకీయ నేత కేవలం ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పవచ్చు. సినీ ప్రేక్షకులకు, ఇటు ప్రజలకు ఆరాధ్యదైవంగా ఎన్టీఆర్ నిలిచిపోయారు. ఈయన స్వర్గస్తులైనప్పటికీ ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నేటి తరం యువతకు ఎన్టీఆర్ గురించి ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు.

ఏదైనా కొత్త విషయం NTR గురించి తెలిస్తే చాలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు. ఇక అలా తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఎన్టీఆర్ ను పేరు పెట్టి పిలవాలి అంటే ఎవరికైనా సరే భయం, గౌరవం ఉండేవి. మరి అలాంటి ఆజానుబాహుడిని నిక్ నేమ్ పెట్టి మరి తన స్నేహితులు గేలి చేసేవారట. ముఖ్యంగా ఆయన చదువుకుంటున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం వైరల్గా మారుతోంది.

ఎన్టీఆర్ కు చదువుకునే రోజుల్లో నాటకాలపై ఎక్కువ ఇష్టం ఉండేది. ఒక అలా ఒకసారి ఎన్టీఆర్ కి ఒక నాటకంలో ఒక పాత్ర పోషించే అవకాశం వచ్చింది . ఎన్టీఆర్ ను విశ్వనాథ సత్యనారాయణ గారు నాయకురాలు నాగమ్మ పాత్ర వేయమని బలవంతం చేశాడట . ఇక ఇంట్లో అందరూ వద్దు అని చెప్పినా ఆయన బాబాయ్ మాత్రం వెయ్యమని ప్రోత్సహించారట.

లేడీ గెటప్ వెయ్యాలి అంటే మీసాలు తీయాలి.. అందుకు ఒప్పుకొని మేకప్ అంతా అయ్యాక.. కవి గారు వచ్చి చూసి ఏంటి మీసాలు తీసేయ్ అని అన్నారట. ఇక మీసం తీయడం కుదరదు అని గొడవపడ్డారు ఎన్టీఆర్. మీసాలు తీయకుండా అయితేనే.. వేశం వేస్తా అనే షరతు తో స్టేజిపై నటించారు ఎన్టీఆర్. మొత్తానికి ఎలాగోలా మేనేజ్ చేసిన ఈయన ఆ నాటకంలో ఉత్తమనటుడిగా రెండో బహుమతి గెలుపొందారు.

అలా తన నాటకీయ జీవితం మొదలైంది. మీసాలతో నాయకురాలు నాగమ్మ పాత్ర ధరించడంతో అప్పటి నుంచి అందరూ కాలేజీలో ఆయనను మీసాల నాగమ్మ అని ఆటపట్టించే వారట. ఆ కాలంలో ఎలా కష్టపడ్డారు అంటే పరీక్షల సమయంలో కూడా పాలు అమ్మి కాలేజీకి వెళ్లేవారట. విజయవాడలో పడమటి లో పాలు అమ్మిన ఆయన రాష్ట్రాన్ని ఏలే స్థాయికి చేరుకున్నారు.