స‌ర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అయ్యేనా… లాభాలు క‌ష్ట‌మే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట గ‌త గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయినా ఫ‌స్ట్ వీకెండ్ మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 95 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింద‌ని అంటున్నారు. వీకెండ్ అయ్యాక సినిమా వ‌సూళ్ల‌లో భారీ డ్రాఫ్ క‌నిపించింది.

సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చినా కూడా రీపీటెడ్ ఆడియెన్స్ వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో వీకెండ్ త‌ర్వాత వీక్ డేస్‌లో సినిమా తేలిపోయింది. ఓవైపు మేక‌ర్స్ భారీ స్థాయిలో వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని చెపుతున్నా ఇక్క‌డ థియేట‌ర్లు ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే ఎఫ్ 3 వ‌చ్చే వ‌ర‌కు స‌రైన సినిమా లేదు. సెకండ్ వీకెండ్‌లో కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎదురు లేదు.

అప్పుడు భారీ వ‌సూళ్లు వ‌స్తే త‌ప్పా స‌ర్కారు వారి పాట బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రాద‌ని అంటున్నారు. ఈ వీకెండ్‌లో రాజ‌శేఖ‌ర్ శేఖ‌ర్‌, సంపూర్ణేష్ ధ‌గ‌డ్ సాంబ ఉన్నా అవి మ‌హేష్ సినిమాకు పోటీ కాదు. అయితే అప్ప‌టి వ‌ర‌కు బలంగా స‌ర్కారు వారి పాట ఉంటుందా ? ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుందా ? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టికే టిక్కెట్ రేట్లు భారీగా ఉన్నాయి. రేట్లు త‌గ్గిస్తే త‌ప్పా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఛాన్స్ లేదు. మ‌రి ఈ విష‌యంలో మేక‌ర్స్ ఏం నిర్ణ‌యం తీసుకుంటారో ? చూడాలి. ఏదేమైనా స‌ర్కారు కు లాభాలు పెద్ద‌గా వ‌చ్చే ఛాన్స్ లేదు.

Share post:

Popular