చైతుకే స‌వాల్ విసురుతోన్న స‌మంత‌… గెలుపు ఎవ‌రిదో…!

టాలీవుడ్ సార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల పాటు భార్య‌, భ‌ర్త‌లుగా ఉన్న వీరిద్ద‌రిని క‌లిపేందుకు ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విన‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు వారు విడాకుల‌కు వెళ్లిపోయారు. విడాకుల త‌ర్వాత అటు స‌మంత‌.. ఇటు నాగచైతన్య ఫుల్ బిజీగా మారిపోయారు. సమంత తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉంది.

తెలుగులో ఆమె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమాతో పాటు అటు య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమా కూడా చేస్తోంది. అటు హాలీవుడ్ సినిమాల్లో న‌టించేందుకు టెస్ట్ షూట్‌లో కూడా స‌మంత పాల్గొంది. ఇక నాగ‌చైత‌న్య విడాకుల త‌ర్వాత బంగార్రాజు, ల‌వ్‌స్టోరీ లాంటి రెండు హిట్ సినిమాలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. పైగా చైతు కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

అమీర్‌ఖాన్‌తో క‌లిసి చైతు న‌టిస్తోన్న బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించగా నాగ చైతన్య ఆర్మీ జవాన్ పాత్రలో సరికొత్త లుక్ లో నటించారు. ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే నెల 12న స‌మంత న‌టిస్తోన్న థ్రిల్ల‌ర్ య‌శోద కూడా రిలీజ్ అవుతోంది.

స‌మంత‌కు టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉంది. అటు మాజీ భ‌ర్త సినిమా కూడా ఒక రోజు ముందుగా తెలుగులో వ‌స్తోంది. చైతు తొలి బాలీవుడ్ సినిమా కావ‌డం.. ఇటు తెలుగులో కూడా వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై కూడా తెలుగు స‌ర్కిల్స్‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ మాజీ భార్య‌, భ‌ర్త‌ల పోరులో ఎవ‌రు గెలుస్తారో ? పై చేయి ఎవ‌రిదో చూడాలి.

Share post:

Latest